Share News

TTD: వేంకటేశ్వర స్వామి భక్తులకు అలర్ట్.. ఇవాళ 6 గంటలకు ఇలా చేయండి

ABN , Publish Date - Sep 23 , 2024 | 04:37 PM

తిరుమల లడ్డూ పవిత్రత దెబ్బతిన్న వేళ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న శ్రీ వేంకటేశ్వర స్వామి భక్తులకు టీటీడీ(TTD) కీలక సూచనలు చేసింది. "తిరుమల శ్రీవారి ఆలయంలోని యాగశాలలో లడ్డూ ప్రసాదాలు, నైవేద్యం పవిత్రతను పునరుద్ధరించడానికి, భక్తుల సంక్షేమానికి శాంతి హోమం ఆగమోక్తంగా జరిగింది.

TTD: వేంకటేశ్వర స్వామి భక్తులకు అలర్ట్.. ఇవాళ 6 గంటలకు ఇలా చేయండి

తిరుమల: తిరుమల లడ్డూ పవిత్రత దెబ్బతిన్న వేళ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న శ్రీ వేంకటేశ్వర స్వామి భక్తులకు టీటీడీ(TTD) కీలక సూచనలు చేసింది. "తిరుమల శ్రీవారి ఆలయంలోని యాగశాలలో లడ్డూ ప్రసాదాలు, నైవేద్యం పవిత్రతను పునరుద్ధరించడానికి, భక్తుల సంక్షేమానికి శాంతి హోమం ఆగమోక్తంగా జరిగింది. శాంతి హోమం నిర్వహించిన ఆచార్యపురుషుల సూచనల మేరకు శ్రీవారి భక్తులు సోమవారం సాయంత్రం 6 గంటలకు తమ ఇళ్లలో దీపారాధన చేస్తూ క్షమ మంత్రం పఠించగలరు"అని టీటీడీ ఓ ప్రకటన విడుదల చేసింది. హోమం నిర్వహించిన ఆచార్యుల సూచనల మేరకు ఇవాళ సాయంత్రం 6 గంటలకు శ్రీవారి భక్తులు దీపారాధన చేస్తూ 'క్షమ మంత్రం' చదవాలి. 'ఓం నమో నారాయణాయ.. ఓం నమో భగవతే వాసుదేవాయ.. ఓం నమో వేంకటేశాయ..' మంత్రాలను జపించి, స్వామి వారి దివ్యానుగ్రహాన్ని పొందాలి.


కాగా ఇవాళ ఉదయం తిరుమలలో శాంతి హోమం నిర్వహించిన సంగతి తెలిసిందే. సర్వ పాప పరిహారార్థం, భక్తుల శ్రేయస్సును ఆకాంక్షిస్తూ సోమవారం ఉదయం 6 నుంచి 10 గంటల వరకు తిరుమలలోని బంగారు భావిష్యంత ఉన్న యాగశాలలో శాంతి హోమం నిర్వహించారు. ఆగస్టు 15 నుంచి 17 వరకు టీటీడీ మూడు రోజులపాటు పవిత్రోత్సవాలను ఆకమోక్తంగా నిర్వహించిందని, అయితే శ్రీవారి నైవేద్యంలో కల్తీ పదార్థాలు గుర్తించినందున, అందుకు పరిహరణగా శాంతి హోమం జరిపామని టీటీడీ వెల్లడించింది.


రేపు టోకెన్ల విడుదల..

డిసెంబర్ నెలకు సంబంధించిన తిరుమల శ్రీవారి స్పెషల్ దర్శనం (రూ.300) టోకెన్లను మంగళవారం ఉ.10 గంటలకు విడుదల చేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది. అదే నెలకు సంబంధించి గదుల కోటాను రేపు మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్లో రిలీజ్ చేయనున్నట్లు తెలిపింది. మరిన్ని వివరాలకు, టికెట్లు బుక్ చేసుకునేందుకు టీటీడీ వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించింది.

Bathukamma Fest: పూలనే దేవుళ్లుగా కొలిచే ఆడబిడ్డల పండుగ.. బతుకమ్మ విశేషాలు తెలుసా

For Latest News and National News click here

Updated Date - Sep 23 , 2024 | 04:52 PM