AP Elections Results: బాబు గెలుపు.. సహకరించిన జగన్ మనిషి..?
ABN , Publish Date - Jun 05 , 2024 | 03:43 PM
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లోనే కాదు.. సార్వత్రిక ఎన్నికల్లో సైతం ఫ్యాన్ పార్టీ ఘోర పరాజయం పాలైంది. ఈ ఎన్నికల్లో ఓటమికి అనేక కారణాలు ఉన్నా అందులో ఒక వ్యక్తి ప్రధాన కారణమని ప్యాన్ పార్టీ కేడర్‌లో ఓ అభిప్రాయం వ్యక్తమవుతున్నట్లు తెలుస్తుంది.
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లోనే కాదు.. సార్వత్రిక ఎన్నికల్లో సైతం ఫ్యాన్ పార్టీ ఘోర పరాజయం పాలైంది. ఈ ఎన్నికల్లో ఓటమికి అనేక కారణాలు ఉన్నా అందులో ఒక వ్యక్తి ప్రధాన కారణమని ప్యాన్ పార్టీ కేడర్‌లో ఓ అభిప్రాయం వ్యక్తమవుతున్నట్లు తెలుస్తుంది. బీఆర్ఎస్ బాస్ కేసీఆర్ మాటలను వైయస్ జగన్ తూ చ తప్పకుండా పాటించడం వల్లే.. తమ పార్టీ అధినేత వైయస్ జగన్‌కు ప్రస్తుతం ఈ పరిస్థితి ఎదురైందని వారు పేర్కొన్నట్లు సమాచారం.
గతేడాది చివరిలో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటరు.. కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. దాంతో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ఆ క్రమంలో ముఖ్యమంత్రి పదవికి కేసీఆర్ రాజీనామా చేశారు. అనంతరం ఆయన తన నివాసంలో పడిపోయారు. దీంతో ఆయన కాలుకు శస్త్ర చికిత్స జరిగింది. అందులోభాగంగా కేసీఆర్‌కు ప్రముఖుల పరామర్శలు వెల్లువెత్తాయి. అందులోభాగంగా సీఎం, పార్టీ అధినేత వైయస్ జగన్ సైతం హైదరాబాద్ వెళ్లి.. గులాబీ బాస్ కేసీఆర్‌ను పరామర్శించారు.
అయితే ఈ సందర్భంగా ఈ ఇద్దరి మధ్య తెలంగాణ ఎన్నికల ఫలితాలు.. బీఆర్ఎస్ పార్టీ ఓటమిపై చర్చ జరిగిందని ప్యాన్ పార్టీ కేడర్ పేర్కొంటుంది. అయితే తాను ఎన్నికల్లో అభ్యర్థులను మార్చకపోవడం వల్లే ఓటమిని చవి చూడాల్సి వచ్చిందని సీఎం జగన్‌తో కేసీఆర్ పేర్కొన్నట్లు ఓ ప్రచారం అయితే నాడు అటు మీడియాలో ఇటు సోషల్ మీడియాలో వైరల్ అయిందని ఫ్యాన్ పార్టీ కేడర్ ఈ సందర్భంగా గుర్తు చేస్తుంది. ఇక ఈ భేటీ అనంతరం ఏపీ సీఎం వైయస్ జగన్.. ఆంధ్రప్రదేశ్‌లోని అసెంబ్లీ, లోక్‌సభ అభ్యర్థులను వరుసగా మార్చడం ప్రారంభించారని కేడర్ పేర్కొంటుంది.
దీంతో పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలతోపాటు సీనియర్లు సైతం ఫ్యాన్ పార్టీ వీడి ఇతర పార్టీల్లోకి జంప్ కొట్టారని వివరిస్తుంది. అయితే వారిని ఆపే ప్రయత్నం మాత్రం సీఎం జగన్ కానీ, పార్టీలోని ఇతర అగ్రనేతలు కానీ చేయలేదని కేడర్ ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేస్తుంది. దాంతో అసెంబ్లీ అభ్యర్థులను మార్చక కేసీఆర్ తప్పు చేస్తే.. అసెంబ్లీ అభ్యర్థులను మార్చి సీఎం జగన్ తప్పు చేశారని కేడర్ ఈ సందర్భంగా స్పష్టం చేస్తుంది. అందులోభాగంగానే తాజా ఎన్నికల ఫలితాలు పూర్తిగా తారుమారయ్యాయని వివరిస్తుంది.
అంతేకాదు కేసీఆర్‌తో భేటీ తర్వాతే పార్టీ అధినేత సీఎం వైయస్ జగన్.. పలు కీలక నిర్ణయాలు సైతం తీసుకున్నారని చెబుతుంది. 2018 డిసెంబర్‌లో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగడం.. వరుసగా రెండోసారి టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని.. ఇక 2019లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు జరగడంతో వైయస్ జగన్ అధికారంలోకి వచ్చారని కేడర్ వివరిస్తుంది.
అనంతరం సీఎం వైయస్ జగన్ హైదరాబాద్ బేగంపేటలోని సీఎం క్యాంప్ కార్యాలయానికి వెళ్లి.. సీఎం కేసీఆర్‌తో సైతం భేటీ అయ్యారని చెబుతుంది. ఇక ఈ ఇద్దరు సీఎంలుగా ఒకే రీతిగా వ్యవహరించారని కేడర్ గుర్త చేస్తుంది. అంటే ఇద్దరు క్యాంప్ కార్యాలయం దాటి బయటకు వచ్చిన దాఖలాలు అయితే లేవంటుంది. అలాగే తెలంగాణ సీఎంగా కేసీఆర్ ప్రజా భవన్ వేదికగా అడపా దడపా ప్రెస్‌మీట్ అయినా పెట్టే వారని.. కానీ సీఎం వైయస్ జగన్ మాత్రం అది కూడా చేయలేదని సోదాహరణగా సదరు పార్టీ కేడర్ వివరిస్తుంది. పక్క రాష్ట్రంలో గులాబీ బాస్ మాటలు విని... తమ బాస్ వైయస్ జగన్ తమను పార్టీని నిండా ముంచేశారని కేడర్ ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తుంది.