Share News

Minister Narayana: అమరావతిలో రూ.11,467 కోట్లతో అభివృద్ధికి ఆమోదం

ABN , Publish Date - Dec 02 , 2024 | 09:26 PM

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో అభివృద్ధి పనులకు సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారని మున్సిపల్ పరిపాలన శాఖ మంత్రి పి.నారాయణ వెల్లడించారు. సోమవారం సీఎం చంద్రబాబు అధ్యక్షతన సీఆర్‌డీఏ 41వ అథారిటీ సమావేశం జరిగింది. మొత్తం 23 అంశాల ఎజెండాగా ఈ సమావేశం సాగింది.

 Minister Narayana: అమరావతిలో రూ.11,467 కోట్లతో అభివృద్ధికి ఆమోదం

అమరావతి, డిసెంబర్ 02: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో రూ.11,467 కోట్లతో అభివృద్ధి పనులకు సీఎం చంద్రబాబు నాయుడు ఆమోదం తెలిపారని మున్సిపల్ పరిపాలన శాఖ మంత్రి పి.నారాయణ వెల్లడించారు. రూ.2,498 కోట్లతో ట్రంక్ రోడ్ల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించామన్నారు. సోమవారం సీఎం చంద్రబాబు అధ్యక్షతన సీఆర్‌డీఏ 41వ అథారిటీ సమావేశం జరిగిందన్నారు.

Also Read: ఆ రెండు నగరాలకు మెట్రో రైల్‌.. ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

Also Read: కాకినాడ పోర్ట్‌కు ఐపీఎస్‌ అధికారి.. సీఎం కీలక నిర్ణయం

Also Read: వరద నీటిలో కొట్టుకు పోయిన బస్సులు, కార్లు.. ఎక్కడంటే..

Also Read: పవన్‌ని చూస్తే.. గబ్బర్ సింగ్ 3 గుర్తుకు వస్తుంది


మొత్తం 23 అంశాలు ఎజెండాగా ఈ సమావేశం కొనసాగిందని తెలిపారు. ఈ సందర్భంగా అమరావతి అభివృద్ధి పనులకు సీఎం చంద్రబాబు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారని ఆయన పేర్కొన్నారు. త్వరలో ఐకానిక్ టవర్స్ నిర్మాణ ప్రక్రియ ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. వరద నివారణకు రూ.1,585 కోట్లతో పాల వాగు, కొండవీటి వాగు పనులు చేపడతామని వివరించారు.

Also Read: ఇన్ఫోసిస్‌కు పెద్ద ఎదురుదెబ్బ..రూ.238 కోట్ల భారీ జరిమానా

Also Read: తిరుమల రెండో ఘాట్ రోడ్డులో యువకుల హల్‌చల్

Also Read: ఈ ఐపీఎస్‌ను కాలం ఎంతలా పగబట్టిందంటే..

Also Read: నామినేటేడ్ పోస్టులపై కసరత్తు.. మరో 15 రోజుల్లో ప్రకటన


గ్రావిటీ కెనాల్‌తో పాటు రిజర్వాయర్ల నిర్మాణానికి సైతం ఆమోదం తెలిపామన్నారు. గెజిటెడ్, నాన్ గెజిటెడ్, క్లాస్ - 4, ఆలిండియా సర్వీస్ అధికారుల భవనాల నిర్మాణ పనులను రూ.3,523కోట్లతో చేపట్టేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారని చెప్పారు. అలాగే రైతులకు ఇచ్చిన రిటర్నబుల్ లేఅవుట్‌లలో రహదారులు, మౌలిక వసతుల కల్పనకు రూ.3,859 కోట్లతో అనుమతి ఇచ్చామన్నారు. జనవరిలో టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. ఇక గత వైసీపీ ప్రభుత్వం రాజధాని అమరావతితో మూడు ముక్కలాట ఆడిందని విమర్శించారు.

Also Read: కొత్త ఇంటికి శ్రద్ధా.. ఎక్కడంటే..


ఈ ఏడాది మే, జూన్ మాసాల్లో జరిగిన ఎన్నికల్లో కూటమికి ఓటరు పట్టం కట్టాడు. దీంతో చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం కొలువు తిరింది. దీంతో గత జగన్ ప్రభుత్వ హయాంలో పూర్తిగా ఆగిపోయిన రాజధాని అమరావతి నిర్మాణ పనులకు మళ్లీ పూర్వ వైభవం వచ్చినట్లు అయింది. ఓ వైపు కేంద్రం తోడ్పాటు, మరోవైపు సీఎం చంద్రబాబు దార్శనికతతో అమరావతి నిర్మాణ పనులు ఊపందుకొంటున్నాయి. అందులోభాగంగా ఈ రోజు సీఆర్‌డీఏ సమావేశం.. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశమై.. అభివృద్ధి పనులకు ఆమోదం తెలిపారు.


అథారిటీ ఆమోదించిన మొత్తం 23 అంశాలు...

1.సాంకేతిక క‌మిటీ ఇచ్చిన నివేదిక ప్ర‌కారం కాంట్రాక్ట్ ఏజెన్సీల‌తో ఒప్పందాలు ర‌ద్దు చేసుకున్న‌ప్ప‌టి నుంచి 120 రోజుల్లోగా పెండింగ్ బిల్లులు చెల్లించేందుకు అథారిటీ ఆమోదం. సాంకేతిక క‌మిటికి ప్ర‌భుత్వం ఆమోదం తెలుపుతూ న‌వంబ‌ర్ 27న జీవో ఎంఎస్ 123 విడుద‌ల‌.

2.అమ‌రావ‌తి గ‌వ‌ర్న‌మెంట్ కాంప్లెక్స్ లో భాగంగా మ‌ధ్య‌లో నిలిచిపోయిన గెజిటెడ్ ఆఫీస‌ర్స్ టైప్ - 1,టైప్ - 2, క్లాస్ - 4 ఉద్యోగుల అపార్ట్‌మెంట్స్ పూర్తికి రూ. 594. 54 కోట్ల‌కు అథారిటీ ఆమోదం.

మొత్తం 1,440 అపార్ట్ మెంట్ ల పెండింగ్ ప‌నులు (ఆర్కిటెక్చ‌ర్, ప్లంబింగ్, శానిట‌రీ,ఫైర్,సెక్యూరిటీ వంటివి) పూర్తికి రూ. 594.54 కోట్లతో పాల‌నాప‌ర‌మైన అనుమ‌తుల‌కు ఆమోదం. రెండేళ్ల DLP (DEFECT LIABILITY PERIOD)తో ప‌నులు చేప‌ట్టేలా ఏజెన్సీకి ఇచ్చేందుకు నిర్ణ‌యం. నిర్మాణంలో ఉన్న సిల్ట్ ప్ల‌స్ 12 అంత‌స్తుల‌తో మొత్తం 14 ట‌వ‌ర్లు నిర్మాణం. 2017 అక్టోబ‌ర్ 11న ఆయా క్వార్ట‌ర్ల నిర్మాణానికి అనుమ‌తి. మొత్తం రూ. 785 కోట్ల అంచ‌నాలు, రూ. 408.63 కోట్ల ప‌నులు 2019 కంటే ముందే పూర్తి.

3.గెజిటెడ్ ఆఫీస‌ర్స్ టైప్ - 1,టైప్ - 2,క్లాస్ - 4 ఉద్యోగుల క్వార్ట‌ర్ల వ‌ద్ద మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌న ప‌నులను రూ. 226.26 కోట్ల‌తో చేప‌ట్టేందుకు అథారిటీ ఆమోదం.

తాగునీరు, అండ‌ర్ గ్రౌండ్ డ్రైనేజి, వ‌ర‌ద నీటి కాల్వ‌ప‌నులు, వీధి దీపాలు, అంత‌ర్గ‌త ర‌హ‌దారులు, బిల్డింగ్ సెక్యూరిటీ, ల్యాండ్ స్కేపింగ్ ప‌నుల‌ను చేప‌ట్టేందుకు 2018 డిసెంబ‌ర్ 18వ తేదీన రూ. 121.34 కోట్ల‌కు అథారిటీ ఆమోదం తెలిపింది. మార్చి 2019లో ప‌నులు ప్రారంభం అయ్యాయి. జూన్ 2019 లో నిలిచిపోయాయి. తిరిగి కాంట్రాక్ట్ ఏజెన్సీకి రెండేళ్ల DLP (DEFECT LIABILITY PERIOD) తో ప‌నులు చేప‌ట్టేలా ఇచ్చేందుకు నిర్ణ‌యం.

4 .నాన్ గెజిటెడ్ ఆఫీస‌ర్ల ఇళ్ల‌కు మిగిలిన ప‌నులను రూ. 607.50 కోట్ల‌తో చేప‌ట్ట‌డానికి అథారిటీ ఆమోదం. (ప్ర‌పంచ బ్యాంకు, ఏడీబీ నిధులు)

మొత్తం 1140 ఫ్లాట్లు 12 ట‌వ‌ర్ల‌లో సిల్ట్ ప్ల‌స్ 12 అంత‌స్తుల‌తో నిర్మాణం.

5.నాన్ గెజిటెడ్ ఆఫీస‌ర్ల ఇళ్ల‌కు మిగిలిన ప‌నులు, మౌలిక వ‌స‌తుల‌ను రూ. 594.36 కోట్ల‌తో చేప‌ట్టేందుకు అథారిటీ ఆమోదం. (ప్ర‌పంచ బ్యాంకు, ఏడీబీ నిధులు).

మొత్తం 9 ట‌వ‌ర్లు, సిల్ట్ ప్ల‌స్ 12 అంత‌స్థులతో మొత్తం 855 ఫ్లాట్లు నిర్మాణం.


6.ఆలిండియా స‌ర్వీస్ అధికారులు (ముఖ్య కార్య‌ద‌ర్శులు, కార్య‌ద‌ర్శులు) కు 115 బంగ్లాల పెండింగ్ ప‌నులను రూ. 516.6 కోట్ల‌తో చేప‌ట్టేందుకు అథారిటీ ఆమోదం.

2017 డిసెంబ‌ర్ 27వ తేదీన ఆలిండియా స‌ర్వీస్ అధికారులైన ముఖ్య కార్య‌ద‌ర్శులు, కార్య‌ద‌ర్శుల కోసం జీ ప్ల‌స్ వ‌న్ విధానంలో నిర్మించేందుకు రూ. 274.5 కోట్ల‌కు పాల‌నా ప‌ర‌మైన అనుమ‌తులు ఇచ్చారు. మే 2018లో ప‌నులు ప్రారంభ‌మైన‌ప్ప‌టికీ జూన్ 2019లో ప‌నులు నిలిచిపోయాయి. తిరిగి ఆ ప‌నుల‌ను పూర్తి చేసేందుకు రూ. 516.6 కోట్ల‌కు అథారిటీ ఆమోదం. మొత్తం 5,28,125 చ‌.అడుగుల విస్తీర్ణంతో ఈ 115 బంగ్లాలు నిర్మాణం. రెండేళ్ల DLP (DEFECT LIABILITY PERIOD)తో ప‌నులు చేప‌ట్టేలా ఏజెన్సీకి ఇచ్చేందుకు నిర్ణ‌యం.

7 - 13 - ఎల్పీఎస్ జోన్లలో మొత్తం 8496.30 ఎకరాల్లో మౌలిక వ‌స‌తులను రూ. 3859. 66 కోట్ల‌తో చేప‌ట్టేందుకు అధారిటీ ఆమోదం.

రైతుల‌కు తిరిగిచ్చిన ల్యాండ్ పూలింగ్ స్కీం జోన్ల‌లో మౌలిక వ‌స‌తులు క‌ల్పించేందుకు అవ‌స‌ర‌మైన నిధులు విడుద‌ల‌కు ఆమోదం. రోడ్లు, వ‌ర‌ద నీరు కాల్వ‌లు, మంచినీటి స‌ర‌ఫ‌రా, డ్రైనేజి, ప‌వ‌ర్ డ‌క్ట్స్, రీయూజ్ వాట‌ర్ నెట్ వ‌ర్క్, వాకింగ్ ట్రాక్, సైకిల్ ట్రాక్ ల‌తో మౌలిక వ‌స‌తులు క‌ల్ప‌న‌. 2019 జూన్‌కు ముందు రూ. 3306. 59 కోట్ల‌తో ప‌నులు చేప‌ట్టాల‌ని నిర్ణయం. సవ‌రించిన అంచ‌నాల ప్ర‌కారం రూ. 3859. 66 కోట్ల‌కు ఆమోదం.

7. జోన్ - 1ఎ - నెక్క‌ల్లు - 1390.1 ఎక‌రాలు

8.జోన్ - 1బి - నెక్క‌ల్లు, శాఖ‌మూరు - 760.27 ఎక‌రాలు

9.జోన్ - 2బి - అనంత‌వ‌రం, నెక్క‌ల్లు, నేల‌పాడు, శాఖ‌మూరు, తుళ్లూరు గ్రామాల్లో కొన్ని భాగాలు - 1223.76 ఎకరాలు

10.జోన్ - 2బి - అనంత‌వ‌రం, నెక్క‌ల్లు, నేల‌పాడు, శాఖ‌మూరు, తుళ్లూరు గ్రామాల్లో కొన్నిభాగాలు - 862.80 ఎకరాలు


11.జోన్ - 5బి - అబ్బ‌రాజుపాలెం, బోరుపాలెం, దొండ‌పాడు, రాయ‌పూడి - 1788.42 ఎకరాలు

12.జోన్ - 5డి - అబ్బ‌రాజు పాలెం, తుళ్లూరు, రాయ‌పూడి - 1488.81ఎకరాలు

13.జోన్ - 6 - కొండ‌మ‌రాజుపాలెం, రాయ‌పూడి - 981.72 ఎకరాలు

14.అమ‌రావ‌తిలో హ్యాపీ నెస్ట్ ప్రాజెక్ట్ చేప‌ట్టేందుకు స‌వ‌రించిన అంచనాల‌కు (రూ. 984.10 కోట్ల‌కు) ఆమోదం. కొత్త‌గా టెండ‌ర్లు పిలిచేందుకు అనుమ‌తి, ప్రాజెక్ట్ ఆల‌స్యంతో న‌ష్ట‌పోయిన రూ. 270.71 కోట్లు ప్ర‌భుత్వం చెల్లించేందుకు అనుమ‌తి.

మొత్తం 12 ట‌వ‌ర్లు జీ ప్ల‌స్ 18 అంత‌స్తుల్లో 1200 ఫ్లాట్లు. మొత్తంగా 20,89,260 చ‌ద‌ర‌పు అడుగుల్లో నిర్మాణం.

2018లో వంద శాతం సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్‌గా సీఆర్డీఏ చేప‌ట్టింది. 190 ఫ్లాట్లు మిన‌హా మిగిలిన అన్ని ఫ్లాట్లు అమ్మ‌కం.

గ‌తంలో 2018-19 అంచ‌నాల ప్ర‌కారం రూ. 720.5 కోట్ల‌కు ఆమోదం తెలిపారు. 2024-25 ధ‌ర‌ల ప్ర‌కారం రూ. 930 కోట్లు. దీనికి అద‌నంగా పెరిగిన లిఫ్ట్ చార్జీలు, లేబ‌ర్, డిజైన్ చార్జీలు, మెటీరియ‌ల్ ధ‌ర పెర‌గ‌డంతో ప్ర‌కారం రూ. 984.10 కోట్ల‌కు చేరింది. మొత్తం అపార్ట్‌మెంట్ల నిర్మాణానికి ల్యాండ్ ధ‌ర రూ. 59.32 కోట్లు (ఎక‌రాకు రూ. 4.1 కోట్ల చొప్పున 14.46 ఎక‌రాలు), నిర్మాణ ధ‌ర రూ. 984.10 కోట్లు, ఇత‌ర ఛార్జీలు రూ. 37.76 కోట్లు క‌లిపి మొత్తం రూ. 1081.18 కోట్లు ఖ‌ర్చ‌వుతుంది. అయితే చ‌ద‌ర‌పు అడుగు 4049 రూపాయిల చొప్పున 1200 ఫ్లాట్ల‌కు రూ. 845.89 కోట్లు ఆదాయం వ‌స్తుంది. ప్రాజెక్ట్ ఆల‌స్యం కావ‌డంతో రూ. 235. 29 కోట్లు, రెరా నిబంధ‌న‌ల ప్ర‌కారం వ‌డ్డీ చెల్లింపున‌కు రూ. 35.42 కోట్లు ఖ‌ర్చు క‌లిపితే మొత్తం రూ. 270.71 కోట్లు న‌ష్టం వ‌స్తుంది.

15.అమ‌రావ‌తి డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ గ‌తంలో ఇచ్చిన కాంట్రాక్ట్‌లు ప్యాకేజి 1 నుంచి ప్యాకేజి 22 వ‌ర‌కూ, సీడ్ యాక్సిస్ రోడ్డుకు సంబంధించిన ప్యాకేజిలు ర‌ద్దుకు అధారిటీ ఆమోదం.

ట్రంక్ ఇన్ఫ్రాస్ట్ర‌క్చ‌ర్ ప‌నులు, వ‌ర‌ద నివార‌ణ ప‌నులు, గ్రీన‌రీ ప‌నులుకు గ‌తంలో ఇచ్చిన కాంట్రాక్ట్ లు ర‌ద్దు.


16.ప్ర‌పంచ బ్యాంకు, ఆసియ‌న్ డెవ‌ల‌ప్‌మెంట్ బ్యాంక్ నిధుల నుంచి అమ‌రావ‌తిలోని వ‌ర‌ద నివార‌ణ ప‌నులు

మూడు ప్యాకేజిలుగా చేప‌ట్టేందుకు అథారిటీ ఆమోదం.

అమ‌రావ‌తి డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ బోర్డు 45వ స‌మావేశంలో తీసుకున్న నిర్ణ‌యం ప్ర‌కారం వ‌ర‌ద నివార‌ణ ప‌నులు మూడు ప్యాకేజిలుగా చేప‌ట్ట‌నున్నారు. ప్యాకేజి -1 ను రూ. 590.74 కోట్లు, ప్యాకేజి -2ను రూ. 386.95 కోట్లు, ప్యాకేజి - 3ను రూ. 608.26 కోట్లు క‌లిపి మొత్తంగా రూ. 1585.95 కోట్లు ఖ‌ర్చు చేసేందుకు అథారిటీ ఆమోదం.

17.కేపిట‌ల్ సిటీలో ఎన్ - 9 రోడ్డుకు ప్యాకేజి 4 కింద మిగిలిపోయిన మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌న కోసం రూ. 522.39 కోట్లకు పాల‌నాప‌ర‌మైన అనుమ‌తులు మంజూరుకు అథారిటీ ఆమోదం.

ఎన్ 9 రోడ్డు వెంబ‌డి రోడ్లు, తాగునీరు, వ‌ర‌ద నీటి కాల్వ‌లు, యుటిలిటీ డ‌క్ట్స్, పాద‌చారుల ట్రాక్‌లు,సైకిల్ ట్రాక్‌లు, ఎవెన్యూ ప్లాంటేష‌న్, స్ట్రీట్ ఫ‌ర్నీచ‌ర్ కోసం రూ. 522.39 కోట్ల‌ను వ‌ర‌ల్డ్ బ్యాంకు, ఆసియ‌న్ డెవ‌ల‌ప్‌మెంట్ బ్యాంకు నిధుల నుంచి ఖ‌ర్చుపెట్టేందుకు సీఆర్డీఏ అథారిటీ ఆమోదం.

18.కేపిట‌ల్ సిటీలో ఎన్ - 18 రోడ్డుకు ప్యాకేజి - 5 కింద మిగిలిపోయిన మౌలిక వ‌స‌తులు క‌ల్పించేందుకు రూ. 98.17 కోట్ల‌కు ఆమోదం.

ఎన్ - 18 రోడ్డు వెంబ‌డి రోడ్లు, తాగునీరు, వ‌ర‌ద నీటి కాల్వ‌లు, యుటిలిటీ డ‌క్ట్స్, పాద‌చారుల ట్రాక్‌లు,సైకిల్ ట్రాక్‌లు, ఎవెన్యూ ప్లాంటేష‌న్, స్ట్రీట్ ఫ‌ర్నీచ‌ర్ కోసం రూ. 98.17 కోట్ల‌ను వ‌ర‌ల్డ్ బ్యాంకు, ఆసియ‌న్‌ డెవ‌ల‌ప్‌మెంట్ బ్యాంకు నిధుల నుంచి ఖ‌ర్చుపెట్టేందుకు సీఆర్డీఏ అథారిటీ ఆమోదం.

19.కేపిట‌ల్ సిటీలో ఎన్ - 15 రోడ్డుకు ప్యాకేజి - 6 కింద మిగిలిపోయిన మౌలిక వ‌స‌తులు క‌ల్పించేందుకు రూ. 482.01 కోట్ల‌కు ఆమోదం.

ఎన్ - 15 రోడ్డు వెంబ‌డి రోడ్లు, తాగునీరు, వ‌ర‌ద నీటి కాల్వ‌లు, యుటిలిటీ డ‌క్ట్స్, పాద‌చారుల ట్రాక్‌లు,సైకిల్ ట్రాక్‌లు, ఎవెన్యూ ప్లాంటేష‌న్, స్ట్రీట్ ఫ‌ర్నీచ‌ర్ కోసం రూ. 482.01 కోట్ల‌ను వ‌ర‌ల్డ్ బ్యాంకు, ఆసియ‌న్ డెవ‌ల‌ప్‌మెంట్ బ్యాంకు నిధుల నుంచి ఖ‌ర్చుపెట్టేందుకు సీఆర్డీఏ అథారిటీ ఆమోదం.

20.కేపిట‌ల్ సిటీలో E6 రోడ్డుకు ప్యాకేజి - 7 కింద మిగిలిపోయిన నిర్మాణ ప‌నులమౌలిక వ‌స‌తులు క‌ల్పించేందుకు రూ. 452.96 కోట్ల‌కు ఆమోదం.

E6 రోడ్డు వెంబ‌డి రోడ్లు, తాగునీరు, వ‌ర‌ద నీటి కాల్వ‌లు, యుటిలిటీ డ‌క్ట్స్, పాద‌చారుల ట్రాక్‌లు,సైకిల్ ట్రాక్‌లు,ఎవెన్యూ ప్లాంటేష‌న్, స్ట్రీట్ ఫ‌ర్నీచ‌ర్ కోసం రూ. 452.96 కోట్ల‌ను వ‌ర‌ల్డ్ బ్యాంకు, ఆసియ‌న్ డెవ‌ల‌ప్‌మెంట్ బ్యాంకు నిధుల నుంచి ఖ‌ర్చుపెట్టేందుకు సీఆర్డీఏ అథారిటీ ఆమోదం.


21.కేపిట‌ల్ సిటీలో E8 రోడ్డుకు ప్యాకేజి - 8 కింద మిగిలిపోయిన నిర్మాణ ప‌నుల మౌలిక వ‌స‌తులు క‌ల్పించేందుకు రూ. 522.92 కోట్ల‌కు ఆమోదం.

E8 రోడ్డు వెంబ‌డి రోడ్లు, తాగునీరు, వ‌ర‌ద నీటి కాల్వ‌లు, యుటిలిటీ డ‌క్ట్స్, పాద‌చారుల ట్రాక్ లు,సైకిల్ ట్రాక్ లు,ఎవెన్యూ ప్లాంటేష‌న్, స్ట్రీట్ ఫ‌ర్నీచ‌ర్ కోసం రూ. 522.92 కోట్ల‌ను వ‌ర‌ల్డ్ బ్యాంకు, ఆసియ‌న్ డెవ‌ల‌ప్‌మెంట్ బ్యాంకు నిధుల నుంచి ఖ‌ర్చుపెట్టేందుకు సీఆర్డీఏ అథారిటీ ఆమోదం.

22.కేపిట‌ల్ సిటీలో N11 రోడ్డుకు ప్యాకేజి - 9 కింద మిగిలిపోయిన నిర్మాణ ప‌నులమౌలిక వ‌స‌తులు క‌ల్పించేందుకు రూ. 419.85 కోట్ల‌కు ఆమోదం.

N11 రోడ్డు వెంబ‌డి రోడ్లు, తాగునీరు, వ‌ర‌ద నీటి కాల్వ‌లు, యుటిలిటీ డ‌క్ట్స్, పాద‌చారుల ట్రాక్ లు,సైకిల్ ట్రాక్ లు,ఎవెన్యూ ప్లాంటేష‌న్,స్ట్రీట్ ఫ‌ర్నీచ‌ర్ కోసం రూ. 419.85 కోట్ల‌ను వ‌ర‌ల్డ్ బ్యాంకు, ఆసియ‌న్ డెవ‌ల‌ప్‌మెంట్ బ్యాంకు నిధుల నుంచి ఖ‌ర్చుపెట్టేందుకు సీఆర్డీఏ అథారిటీ ఆమోదం.

23.అమ‌రావ‌తిలో ట్రండ్ ఇన్ఫ్రాస్ట్ర‌క్చ‌ర్, వ‌ర‌ద నీటి యాజ‌మాన్యం, గ్రీన‌రీ వ‌ర్క్స్ కు సంబంధించి ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ క‌న్స‌ల్టెంట్ నియామ‌కానికి అథారిటీ ఆమోదం.

ప్ర‌పంచ బ్యాంకు, ఏడీబీతో జ‌రిగిన చ‌ర్చ‌ల్లో తీసుకున్న నిర్ణ‌యం మేర‌కు క‌న్స‌ల్టెంట్ నియామ‌కానికి నిర్ణ‌యం. ఈ అంశాలన్నింటిపై మంగళవారం చర్చించి.. కేబినెట్ సమావేశంలో ఆమోదం తెలపనుంది.

For AndhraPradesh News And Telugu news

Updated Date - Dec 02 , 2024 | 09:58 PM