Share News

Construction : రూ.818.03 కోట్లతో.. హ్యాపీనె‌స్ట్‌కు‌‌ టెండర్లు

ABN , Publish Date - Dec 23 , 2024 | 03:06 AM

రాజధాని అమరావతిలోని నేలపాడులో హ్యాపీనెస్ట్‌ నిర్మాణానికి సీఆర్‌డీఏ ఆదివారం టెండర్లు పిలిచింది.

 Construction : రూ.818.03 కోట్లతో.. హ్యాపీనె‌స్ట్‌కు‌‌  టెండర్లు

  • 12 టవర్లు.. 1,200 ఫ్లాట్లు.. జీ+18 అంతస్తులు

  • మూడేళ్లలో ప్రాజెక్టు పూర్తికావాలి

  • సీఆర్‌డీఏ నోటిఫికేషన్‌

  • రూ.818.03 కోట్లతో.. హ్యాపీనెస్ట్‌కు టెండర్లు

విజయవాడ, డిసెంబరు 22(ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతిలోని నేలపాడులో హ్యాపీనెస్ట్‌ నిర్మాణానికి సీఆర్‌డీఏ ఆదివారం టెండర్లు పిలిచింది. రూ.818.03 కోట్ల అంచనాతో హ్యాపీనెస్ట్‌ నిర్మాణం, ఇంటీరియర్‌ పనులు పూర్తి చేసేందుకు ఈ నోటిఫికేషన్‌ ఇచ్చింది. మొత్తం 1,200 ఫ్లాట్ల సామర్థ్యంతో జీ+18 అంతస్తులతో కూడిన 12 టవర్ల నిర్మాణంతో పాటు ఆర్కిటెక్చర్‌ డిజైన్లు, అంతర్గత ఇంటీరియర్‌, ఎలక్ర్టికల్‌, ప్లంబింగ్‌, శానిటరీ, ఫైర్‌ ఫైటింగ్‌, డీజీ సెట్స్‌, సెక్యూరిటీ సిస్టమ్స్‌, లిఫ్ట్స్‌ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. మూడేళ్లలో ప్రాజెక్టును పూర్తి చేయాలని పేర్కొన్నారు.

Updated Date - Dec 23 , 2024 | 03:07 AM