టీడీపీ కార్యకర్తకు సింగపూర్ తెలుగు ఫోరం సాయం
ABN , Publish Date - Aug 16 , 2024 | 03:41 AM
కాలేయ వ్యాధితో బాధపడుతున్న ఓ టీడీపీ కార్యకర్తకు సింగపూర్ తెలుగు ఫోరం ఆర్థిక సాయం అందించింది.
అమరావతి, ఆగస్టు 15(ఆంధ్రజ్యోతి): కాలేయ వ్యాధితో బాధపడుతున్న ఓ టీడీపీ కార్యకర్తకు సింగపూర్ తెలుగు ఫోరం ఆర్థిక సాయం అందించింది. టీడీపీ కార్యకర్త తుమ్మల సత్య చాలా కాలంగా కాలేయ వ్యాధితో బాధపడుతున్నాడు.
అతని వినతికి స్పందించిన సింగపూర్ తెలుగు ఫోరం సభ్యులు రూ.2.14 లక్షలు విరాళంగా సేకరించారు. ఆ మొత్తాన్ని గురువారం ఇక్కడ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు చేతుల మీదుగా సత్యకు అందచేశారు. ఈ కార్యక్రమంలో సింగపూర్ ఫోరం సభ్యులు ఇంటూరి మనోహర్, గుంటుపల్లి నవీన్, గుంటుపల్లి రమేశ్, పొన్నికంటి సాంబశివరావు పాల్గొన్నారు.