Anam Venkataramana Reddy: నువ్వు చేసిన వెధవ పనికి వీకే టెస్టు చేసుకోవాలా.. లఫూట్ నాయాలా?
ABN , Publish Date - Jul 16 , 2024 | 12:12 PM
‘ఎన్నికల్లో ఓ పొట్టోడు.. పొట్టి సారాయి రెడ్డి... నెల్లూరులో తిరిగాడు. నేను నెల్లూరోడిని, నెల్లూరోడిని అనే వాడు. నెల్లూరోడైతే వైజాగ్ లో ప్రెస్ మీట్ ఎందుకు పెట్టాడు?’ అని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి ప్రశ్నించారు.
నెల్లూరు: ‘ఎన్నికల్లో ఓ పొట్టోడు.. పొట్టి సారాయి రెడ్డి... నెల్లూరులో తిరిగాడు. నేను నెల్లూరోడిని, నెల్లూరోడిని అనే వాడు. నెల్లూరోడైతే వైజాగ్ లో ప్రెస్ మీట్ ఎందుకు పెట్టాడు?’ అని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి ప్రశ్నించారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మదన్ మోహన్ అనే వ్యక్తి సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగి అని.. కరెన్సీ నోట్లు ముద్రించే మింట్ సెంటర్‌లో పనిచేసేవాడని అన్నారు. విజయసాయి, సునందలు తమకు రూ.కోటి అరవై లక్షలు ఇచ్చారని మదన్ మోహన్ చెప్పాడన్నారు. అంత పెద్ద మొత్తం ఎందుకిచ్చారో బయటకి రావాలన్నారు. సెంట్రల్ గవర్నమెంటు ఉద్యోగి కాబట్టి, సెంట్రల్ విజిలెన్స్ విచారణ జరిపించాలని ఆనం డిమాండ్ చేశారు.
విల్లా మీద విచారణ జరిగితే ఏం అక్రమాలు జరిగాయో, ఏ ఏ భూములు కొట్టేశారో... బయటకి వస్తాయని ఆనం వెంకట రమణారెడ్డి అన్నారు. మదన్ మోహన్ తన బిడ్డకి తండ్రి ఎవరని అడిగారని.. ఆ పరిస్థితి ఎవరికీ రాకూడదన్నారు. బిడ్డకి విజయసాయి తండ్రి అని చెప్పాడన్నారు. కానీ విజయసాయికి అంత సీను లేదని. విజయసాయికి విషయం లేదని.. కుమార్తెని దత్తతు తీసుకున్నాడని పేర్కొన్నారు. అసలు విజయసాయి పూజకి పనికిరాని పువ్వా..? పనికొచ్చే పువ్వా..? డీఎన్ఏకి రావాలన్నారు. సుదర్శన్ రెడ్డి డీఎన్ఏకి రెడీ అన్నాడని.. మరి విజయసాయి ఎందుకు డీఎన్ఏకి రావడం లేదని ప్రశ్నించారు. ‘‘విజయసాయి... నువ్వు కొలంబియాకి ఎవరితో వెళ్లావు?... కొలంబియా విషయం కూడా బయటకి రావాలి. ఎస్టీ మహిళని మీ భూదందాల కోసం వాడుకుంటావా? ఎస్టీ దంపతులిద్దరు రోడ్డు మీదకి వచ్చారు. మీ పాపానికి ఒక కుటుంబం రోడ్డు మీద పడింది’’ అని ఆనం పేర్కొన్నారు.
ఇంకా ఆనం మాట్లాడుతూ.. ‘‘ఒరేయ్ సాయి... నీ మీద ఆరోపణలు చేసిందెవరు? వైసీపీ నేతలూ తన మీద కుట్రలు చేశారని ఆయనే చెప్పాడు. నువ్వు చేసిన వెధవ పనికి వీకే డీఎన్ఏ టెస్టు చేసుకోవాలా?... లఫూట్ నాయాలా?... మర్డర్లు చేసి జైళ్లకి పోయిన కుటుంబం రా.. మీది. పింక్ డైమండ్ చంద్రబాబు ఇంట్లో చూశాడట... వీడు పోయి బాత్రూంలో చూశాడా? పేపర్లో వార్తలు రాస్తే టార్చర్ పెడతావా? రాధాకృష్ణని అంతు చూస్తానంటావా? విషయం లేని విజయసాయికి బెయిల్ రద్దు చేయాలి. గే... అయితే పిల్లలు పుట్టరురా? నేను అథానీ డిస్టలరీస్, భూముల కుంభకోణం అనేక అంశాలపై ప్రెస్‌మీట్లు పెట్టా? ఎప్పుడైనా ప్రెస్‌మీట్ పెట్టావా? విజయసాయిపై సెంట్రల్ విజిలెన్స్ విచారణ జరిపించాలి. ఇలాంటి కేసులు చాలా ఉన్నాయి. మదన్ మోహన్, శాంతి కలిసి ఉండాలని.. హాయిగా ఉండాలని టీడీపీ కోరుకుంటోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో విజయసాయి పూజకి పనికొస్తాడా? రాడా? అనే విషయంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కాబట్టి విజయసాయి వెంటనే డీఎన్ఏకి ఒప్పుకోవాలి’’ అని పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి
అమరావతి బ్రాండ్ బస్సులను పునరుద్దరిస్తాం
ఇవాళ అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో చంద్రబాబు సమావేశం
For AP News and Telugu News