Share News

THIEFS ARREST : అంతర్‌జిల్లా దొంగల ముఠా అరెస్టు

ABN , Publish Date - Nov 28 , 2024 | 12:10 AM

వ్యసనాలకు మరిగి, సులువుగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో చోరీలకు పాల్పడుతున్న అంతర్‌ జిల్లా దొంగలముఠాను శ్రీసత్యసాయి జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 7.68 లక్షల విలువచేసే బంగారు, వెండి ఆభరణాలు, లక్ష రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు.

THIEFS ARREST : అంతర్‌జిల్లా  దొంగల ముఠా అరెస్టు
వివరాలు వెల్లడిస్తున్న ఎస్పీ రత్న

పుట్టపర్తి రూరల్‌, నవంబరు 27(ఆంధ్రజ్యోతి): వ్యసనాలకు మరిగి, సులువుగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో చోరీలకు పాల్పడుతున్న అంతర్‌ జిల్లా దొంగలముఠాను శ్రీసత్యసాయి జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 7.68 లక్షల విలువచేసే బంగారు, వెండి ఆభరణాలు, లక్ష రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. పుట్టపర్తిలోని జిల్లా పోలీసు కార్యాలయం(డీపీఓ)లో బుధవారం ఏర్పాటుచేసిన సమావేశంలో కేసు ఛేదింపు వివరాలను ఎస్పీ రత్న వెల్లడించారు. అనంతపురం నగరానికి చెందిన షికారి కోటయ్య, షికారి షాలి అలియాస్‌ శ్యామ్‌, షికారి శీనా అలియాస్‌ అర్జున వ్యసనాలకు బానిసలయ్యారు. వాటిని తీర్చుకునేందుకు సులువుగా డబ్బు సంపాదించాలనుకున్నారు. అందుకు చోరీలను ఎంచుకున్నారు. పుట్టపర్తి, గోరంట్ల, కదిరి తదిరత మండలాల్లో చోరీలు చేశారు. వీటిపై బాధితుల ఫిర్యాదుల మేరకు పోలీసులు కేసులు నమోదు చేశారు. చోరీలను జిల్లా పోలీసు అధికారులు సీరియ్‌సగా పరిగణించారు. వాటిని ఛేదించేందుకు పుట్టపర్తి డీఎస్పీ విజయ్‌కుమార్‌, ఎస్బీ సీఐ బాలసుబ్రహ్మణ్యంరెడ్డి, రూరల్‌ సీఐ సురేష్‌, ఎస్‌ఐ లింగన్న, సీసీఎస్‌ సీఐ శివాంజనేయులు, ఎస్‌ఐ రామచంద్రతో ప్రత్యేకబృందం ఏర్పాటు చేశారు. కేసుల దర్యాప్తులో భాగంగా నిందితులు ముగ్గురిని బుధవారం అరస్టు చేశారు. వారి నుంచి నగ లు, నగదు, చోరీలకు వాడిన మోటారు సైకిల్‌ స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ వివరించారు.

రివార్డులు: అంతర్‌ జిల్లా చోరీలకు పాల్పడిన దొంగలను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన పుట్టపర్తి డీఎస్పీ విజయ్‌కుమార్‌, ఎస్బీ సీఐ బాలసుబ్రహ్మణ్యం రెడ్డి, పు ట్టపర్తి రూరల్‌ సీఐ సురేష్‌, ఎస్‌ఐ లింగన్న, సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించి, రివార్డులు అందజేశారు. ఏఎస్పీ ఆర్ల శ్రీనివాసులు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Nov 28 , 2024 | 12:10 AM