Share News

Minister Payyavula Keshav : కేశవ్‌కు అరుదైన గౌరవం

ABN , Publish Date - Aug 10 , 2024 | 12:11 AM

జిల్లా కేంద్రంలోని పోలీస్‌ పరేడ్‌ మైదానంలో ఈ నెల 15న జరిగే స్వాతంత్య్ర దినోత్సవాలలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. జిల్లాలవారీగా జాతీయ జెండాను ఆవిష్కరించే మంత్రుల జాబితాను సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ప్రిన్సిపల్‌ సెక్రటరీ సురేష్‌ కుమార్‌ శుక్రవారం విడుదల చేశారు. జిల్లా నుంచి మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న పయ్యావుల కేశవ్‌కు అరుదైన...

 Minister Payyavula Keshav : కేశవ్‌కు అరుదైన గౌరవం
Minister Payyavula Keshav

స్వాతంత్య్ర దినోత్సవాలకు ముఖ్య అతిథి

పోలీస్‌ పరేడ్‌ మైదానంలో 15న వేడుకలు

జాతీయ జెండాను ఆవిష్కరించనున్న ఆర్థిక మంత్రి

అనంతపురం, ఆగస్టు 9(ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రంలోని పోలీస్‌ పరేడ్‌ మైదానంలో ఈ నెల 15న జరిగే స్వాతంత్య్ర దినోత్సవాలలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. జిల్లాలవారీగా జాతీయ జెండాను ఆవిష్కరించే మంత్రుల జాబితాను సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ప్రిన్సిపల్‌ సెక్రటరీ సురేష్‌ కుమార్‌ శుక్రవారం విడుదల చేశారు. జిల్లా నుంచి మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న పయ్యావుల కేశవ్‌కు అరుదైన అవకాశం లభించింది. స్వాతంత్య్ర దినోత్సవాలు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ ముఖ్య అతిథిగా హాజరవుతారు. జాతీయ జెండాను ఆవిష్కరించి, ప్రభుత్వ ప్రాధాన్య అంశాలు, జిల్లా అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, చొరవ గురించి ప్రజలకు వివరిస్తారు.


దశాబ్దాల శ్రమ..

1994లో అప్పటి ముఖ్యమంత్రి, టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు పిలుపుతో పయ్యావుల కేశవ్‌ పార్టీలో చేరి, తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. అప్పటి నుంచి తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల వరకూ ఏడుసార్లు ఉరవకొండ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు. ఐదుసార్లు విజయం సాధించారు. ఒకసారి ఎమ్మెల్సీగా సేవలు అందించారు.

ఉరవకొండలో ఏ పార్టీ అభ్యర్థి గెలిస్తే ఆ పార్టీ ప్రతిపక్షానికి పరిమితమౌతుందన్న మూఢ నమ్మకం 2019 ఎన్నికల వరకూ కొనసాగింది. దీనికి కేశవ్‌ తెరదించారు. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఉరవకొండ నుంచి ఆయన ఘన విజయం సాధించారు. రాజకీయాల్లోకి వచ్చిన మూడు దశాబ్దాల తరువాత మంత్రి అయ్యారు. తొలిసారే కీలకమైన ఆర్థిక శాఖను దక్కించుకున్నారు. ఇప్పుడు స్వాతంత్య్ర దినోత్సవాలలో జాతీయ జెండాను ఆవిష్కరించే అరుదైన గౌరవం తమ నాయకుడికి దక్కినందుకు నియోజకవర్గ ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు సంతోషంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Aug 10 , 2024 | 12:11 AM