Home » Payyavula Keshav
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ భేటీ అయ్యారు.
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman)తో ఏపీ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ (Payyavula Keshav) భేటీ అయ్యారు. ఇవాళ (మంగళవారం) ఢిల్లీ వెళ్లిన పయ్యావుల కేంద్ర మంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు.
వైసీపీ ప్రభుత్వం చేసిన అస్తవ్యస్త విధానాల వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పడిపోతుందని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం 99 శాతం ఉద్యోగుల జీతాలు పెన్షన్లకే సరిపోతుందని అన్నారు. అంతకు ముందు రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కన్నా ఏడు శాతం ఎక్కువగా ఉద్యోగుల జీతాలు పెన్షన్లకు పెట్టాల్సిన పరిస్థితి ఉండేదని గుర్తుచేశారు.
‘రాజ్యాంగ బద్ధంగానే రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఆర్థిక విషయాల్లో ఉల్లంఘనలకు పాల్పడింది. ఆర్థిక రంగాన్ని కుదేలు చేసింది.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభమైన విషయం తెలిసిందే. అసెంబ్లీలో నేడు పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. పీఎంఏవై ద్వారా రాష్ట్రంలో ఏపీ టిడ్కో అధ్వర్యంలో నిర్మించిన ఇళ్లపై సభలో సల్ప కాలిక చర్చ జరగనుంది.
జగన్ ప్రభుత్వం చివరకు చిన్న పిల్లల చిక్కీల్లోనూ రూ.175 కోట్లు బకాయిలు పెట్టిందని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. రహదారులకు రూ.810 కోట్లు కూటమి ప్రభుత్వంలో కేటాయించినట్లు తెలిపారు. ఒకటో తేదీన ఉద్యోగలకు జీతం అనేది మర్చిపోయిన ఉద్యోగులకు మేలు చేశామని మంత్రి పయ్యావుల ఉద్ఘాటించారు.
Andhrapradesh: ఏపీ అసెంబ్లీలో 2024 -25 సంవత్సరానికి గాను బడ్జెట్ను మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా వైసీపీపై ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు మంత్రి. మొత్తం చేసింది వైసీపీనే అంటూ విరుచుకుపడ్డారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో అన్ని రంగాల్లో విధ్వంసం చోటు చేసుకుందన్నారు.
అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా బడ్జెట్ను ఏపీ అసెంబ్లీలో ఇవాళ(సోమవారం) ఆర్థిక శాఖ మంత్రి, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టనున్నారు. సూపర్6 పథకాలతో పాటు కీలక ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
జీవిత భీమా, వైద్య భీమా ప్రీమియంలపై ఉన్న జీఎస్టీ విషయంలో మంత్రి పయ్యావుల కీలక సూచనలు చేశారు. వృద్ధుల వైద్య భీమా ప్రీమియంపై ఉన్న జీఎస్టీని పూర్తిగా ఎత్తివేయాలని పయ్యావుల సూచించారు. పేదలు.. మధ్య తరగతి ప్రజలకు వైద్య భీమాను చేరువ చేయాలని కేశవ్ కీలక సూచించారు.
వైసీపీ హయాంలో తిరుమలలో ఉన్న పటిష్టమైన వ్యవస్థను వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి నాశనం చేశారని ఏపీ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఆరోపించారు. టీటీడీ ఛైర్మన్గా వైవీ సుబ్బారెడ్డి సైతం అనేక తప్పులు చేశారని మంత్రి మండిపడ్డారు.