Share News

MLA SUNITA : ప్రజల భూముల రక్షణకే ల్యాండ్‌ టైటిలింగ్‌ రద్దు

ABN , Publish Date - Sep 24 , 2024 | 12:07 AM

ప్రజల భూములు రక్షణ కోసమే అధికా రంలోకి రాగానే ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్టు రద్దు చేశామని ఎమ్మెల్యే పరిటాల సునీత తెలిపారు. ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే సోమవారం మండలంలో పర్యటించారు. రాప్తాడు పంచాయతీ రామినేపల్లి లో రూ. 10 లక్షలతో చేపట్టిన అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభించారు.

MLA SUNITA : ప్రజల భూముల రక్షణకే ల్యాండ్‌ టైటిలింగ్‌ రద్దు
MLA Paritala Sunitha speaking in the meeting

‘ఇది మంచి ప్రభుత్వం’లో ఎమ్మెల్యే పరిటాల సునీత

రాప్తాడు, సెప్టెంబరు 23: ప్రజల భూములు రక్షణ కోసమే అధికా రంలోకి రాగానే ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్టు రద్దు చేశామని ఎమ్మెల్యే పరిటాల సునీత తెలిపారు. ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే సోమవారం మండలంలో పర్యటించారు. రాప్తాడు పంచాయతీ రామినేపల్లి లో రూ. 10 లక్షలతో చేపట్టిన అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభించారు. మైనార్టీ కాలనీలో రూ. 43 లక్షలతో సీసీ రోడ్లు, రూ. 17 లక్షలతో డ్రైనేజీ పనులు ప్రారంభించారు. ప్రసన్నాయపల్లి పంచాయతీ చిన్మయ్‌నగర్‌లో రూ. 50లక్షలతో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. మొత్తం రూ.1.20 కోట్లతో అభివృద్ది పనులకు శంఖుస్థాపన చేశారు. ఇంటింటికీ వెళ్లి వంద రోజుల ప్రభుత్వ పాలనను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా మైనార్టీ కాలనీలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ... జగన మళ్లీ సీఎం అయి ఉంటే ప్రజలు భూములు మాయమయ్యేవన్నారు. వైసీపీ పాలనలో గ్రామాల్లో అభివృద్ధి జరగలేదన్నారు. కూటమి అధికారంలోకి రాగానే నియోజకవర్గంలో సీసీ రోడ్ల నిర్మాణానికి రూ. 25 కోట్ల మంజూరు చేయించామన్నారు. గ్రామాల్లో రోడ్ల పనులు ప్రారంభించామన్నారు. అర్హు లైన వారందరకీ సంక్షేమ పథకాలు అందిస్తామన్నారు. త్వరలోనే సూపర్‌ సిక్స్‌ పథకాలైన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత గ్యాస్‌ సిలిండర్లు ప్రారంభిస్తామని తెలిపారు. అనంతరం పౌష్టికాహార మాసోత్స వాల్లో భాగంగా చిన్నారులకు అన్నప్రాసన, అక్షరాభ్యాసం చేశారు.


రహదారి సమస్య పరిష్కారం

ఇటీవల కురిసిన భారీ వర్షాల వలన రాప్తాడు నుంచి చిన్మయ్‌నగర్‌కు వెళ్లే పండమేరు వంక దారి కోతకు గురైంది. సమస్యను స్థానికులు, టీడీపీ నాయకులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. తన ఆదేశాలతో సర్పంచ సాకే తిరుపాలు పంచాయతీ నిధులతో చేపట్టిన తాత్కాలిక రోడ్డు పనులను స్థానిక నాయకులతో కలిసి ఎమ్మెల్యే పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ సాల్మనరాజ్‌, తహసీల్దార్‌ విజయకుమారి, టీడీపీ మండల ఇనచార్జ్‌ ధర్మవరపు మురళి, కన్వీనర్‌ కొండప్ప, ప్రధాన కార్యదర్శి శ్రీనివాసు లు, సర్పంచులు సాకే తిరుపాలు, శశికళ, కురుబ సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్‌ గంగలకుంట రమణ, బీసీ సెల్‌ రాష్ట్ర కార్యదర్శి నారాయణస్వామి, సాకే జయరాముడు, గోనిపట్ల శీనా, మరూరు గోపాల్‌ తదితరులు పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Sep 24 , 2024 | 12:07 AM