MLA : బాధ్యతాయుతంగా పనిచేయండి
ABN , Publish Date - Dec 16 , 2024 | 12:29 AM
మీకున్న పదవులతో బాధ్యతా యు తంగా పనిచేసి చెరువులకింద రైతులు నష్టపోకుండా చూడాలని సాగునీటి సం ఘం నూతన సభ్యులకు ఎమ్మెల్యే పరిటాల సునీత సూచించారు. శనివారం జరిగి న ఎన్నికలలో ఏకగ్రీవంగా ఎన్నికైన అధ్యక్ష, ఉపాద్యక్షులు, సభ్యులు ఆదివారం వెంకటాపురంలో ఎమ్మెల్యేని కలిశారు. ఎటువంటి గొడవలులేకుండా ఏకగ్రీవంగా గెలవడంపై హర్షం వ్యక్తం చేసి, నూతన సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.
ఎమ్మెల్యే పరిటాల సునీత
రామగిరి, డిసెంబరు 15(ఆంధ్రజ్యోతి): మీకున్న పదవులతో బాధ్యతా యు తంగా పనిచేసి చెరువులకింద రైతులు నష్టపోకుండా చూడాలని సాగునీటి సం ఘం నూతన సభ్యులకు ఎమ్మెల్యే పరిటాల సునీత సూచించారు. శనివారం జరిగి న ఎన్నికలలో ఏకగ్రీవంగా ఎన్నికైన అధ్యక్ష, ఉపాద్యక్షులు, సభ్యులు ఆదివారం వెంకటాపురంలో ఎమ్మెల్యేని కలిశారు. ఎటువంటి గొడవలులేకుండా ఏకగ్రీవంగా గెలవడంపై హర్షం వ్యక్తం చేసి, నూతన సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. సా గునీటి సంఘం విధులపై అవగాహన పెంచుకోవాలన్నారు. నియోజకవర్గంలో ప్రతి చెరువుకు నీరందించాలన్నదే లక్ష్యమని, వచ్చిన ప్రతి నీటి బొట్టును సద్విని యోగం చేసుకోవాలని తెలిపారు. ఆయకట్టు రైతులకు సాగునీటి సమస్య వస్తే రాజకీయాలకు తావివ్వకుండా ముందుండి పరిష్కరించాలన్నారు. మండలంలో పెద్ద సాగునీటి సంఘం పేరూరు అప్పర్‌పెన్నార్ ప్రాజెక్టు చైర్మన లక్ష్మీనారాయణ రెడ్డి, సభ్యులతో ఆమె ప్రత్యేకంగా చర్చించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ స్థానిక నాయకులు పాల్గొన్నారు. అదేవిధంగా మండలంలోని దుబ్బార్లపల్లి లో ఎనఆర్‌ఈ జీఎస్ నిధులతో నిర్మించిన సీసీరోడ్లను ఆమె పరిశీలించారు. రూ..55లక్షలతో గ్రామంలో పలు వీదుల్లో సీసీరోడ్లను వేశారు. గత ఐదేళ్లలో గ్రామాల్లో కనీస వసతులులేక ప్రజలు ఇబ్బందులు పడ్డారని రానున్న రోజుల్లో మరింత అభివృద్ధిని చూస్తారని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
బాధిత కుటుంబాలకు పరామర్శ
రామగిరి, డిసెంబరు 15(ఆంధ్రజ్యోతి): మండలంలోని రెడ్డివారిపల్లికి చెందిన బోయ నాగన్న, పెద్దకొండాపురానికి చెందిన ఆర్‌ఎంపీడాక్టర్ వన్నూరప్ప కుటుంబా లను ఎమ్మెల్యే పరిటాలసునీత ఆదివారం సాయంత్రం పరామర్శించారు. రెడ్డివారి పల్లికి చెందిన నాగన్నకు డయాలసిస్ కోసం రూ.10వేలు ఆర్థికసాయం అందిం చారు. పెద్దకొండాపురానికి వెళ్లి ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఆర్‌ఎంపీ కుటుంబసభ్యులను పరామర్శించి దైర్యం చెప్పారు. అదేవిధంగా రోడ్డు ప్రమాదంలో గాయపడి ఇంటివద్దనే విశ్రాంతి తీసుకుంటున్న దుబ్బార్లపల్లిలోని బుర్రావెంకటేశను ఎమ్మెల్యే పరామర్శించారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....