Home » Raptadu
మండలం పరిధిలో పేద లకు ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు స్థల సేకరణను వేగవంతం చేయాలని ఎమ్మెల్యే పరిటాల సునీత సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆమె గురువారం సాయంత్రం మండల తహసీల్దార్ మోహన కుమార్‌తో పాటు హౌసింగ్ డీఈతో తన క్యాంపు కార్యాలయంలో సమావేశం నిర్వహించారు.
అధైర్యపడకండి అండగా ఉంటామని బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే పరిటాల సునీత భరోసా ఇచ్చా రు. మండలంలోని పూలకుంట గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు నారాయణస్వామి కుమారై రేణుక రెండు రోజుల క్రితం ఆత్మహత్య చేసుకుంది.
రామగిరి ఎస్ఐ సుధాకర్ యా దవ్‌పై వైసీపీ చేస్తున్న కుట్ర పూరిత రాజకీయాలను తిప్పి కొట్టడంతో పాటు ఆయనకు అండగా ఉంటామని యాదవ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నారాయణస్వామి యాదవ్ అన్నారు. జిల్లా కేంద్రంలో నక్కా రామారావు యాదవ భవనలో గురువారం సాయంత్రం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. యాదవ సామాజిక వర్గానికి చెందిన ఎస్ఐ సుధాకర్ నిబద్దతతో విధులు నిర్వహిస్తుంటే, ఆయనపై వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడం దుర్మార్గమన్నారు.
Paritala Sunitha Vs Jagan: జగన్ మాట్లాడినవన్నీ పచ్చి అబద్ధాలని ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు. ప్రకాష్ రెడ్డి రాసిచ్చిన స్క్రిప్ట్‌ను జగన్ చదువుతున్నారని విమర్శించారు. పరీక్షల్లో కాపీ కొట్టినట్టుగా పేపర్లు చూసి చదువుతున్నారని వ్యాఖ్యలు చేశారు. పాపిరెడ్డిపల్లిలో అనుకోకుండా ఒక సంఘటన జరిగిందని.. కానీ దాన్ని కొడవండ్లు, మారుణాయుధాలు అంటున్నారన్నారు.
మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మంగళవారం రాప్తాడు నియోజకవర్గంలో పర్యటించనున్నారు.బెంగళూరు నుంచి ప్రత్యేక హెలీకాఫ్టర్లో బయలుదేరి వస్తారు. ఈ నేపథ్యంలో పోలీసులు భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.
సమసమాజ నిర్మాణంకోసం ప్రజలకు ఆదర్శ వంతమైన పాలన అందించడంలో నేటి పాలకులకు మాజీ ఉప ప్రఽధాని డాక్టర్ జగ్జీ వన రామ్ దిక్సూచిలాంటివారని పలువరు నా యకులు కొనియాడారు. జగ్జీవన రామ్ జ యంతిని పురస్కరించుకుని శనివారం వేడు కలను ఘనంగా నిర్వహించారు.
బఫర్‌తో సంబంధం లేకుండా డీలర్లకు రేషన బియ్యం సరఫరా చేయాలని ఎమ్మెల్యే పరిటాల సునీత సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆమె గురువారం సాయం త్రం నగరంలోని క్యాంపు కార్యాలయంలో శ్రీ సత్యసాయి, అనంతపు రం జిల్లాలకు సంబంధించిన పౌరసరఫరాల శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. రేషన డీలర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై అధికారులతో చర్చించారు.
మండలంలోని ఒంటికొండ గ్రామంలో మంగళవారం గావుల మహోత్సవాన్ని ఘనంగా నిర్వహిం చారు. అక్కదేవతల ఉత్సవాలు ముగిసిన అనంతరం మరుసటి రోజు పోతలయ్యస్వామికి ప్రతిఏటా ఇక్కడ గావుల మహోత్సవాన్ని నిర్వహి స్తారు.
చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాకే రాష్ట్ర ప్రజలకు భరోసా వచ్చిందని ఎమ్మెల్యే పరిటాలసునీత అన్నారు. ఎమ్మెల్యే మంగళవారం మండలంలోని వెంకటాపురం గ్రామంలో ఇంటింటికి వెళ్లి పింఛన్లు పంపిణీచేశారు. వారి కష్టసుఖాలు తెలుసుకున్నారు. ప్రతినెల ఒకటో తేదీ ఇంటి వద్దకు పింఛన వస్తోందా... లేదా.. అని ఆరాతీశారు.
ఉగాది పర్వదినాన్ని పురస్కరిం చుకుని చెన్నేకొత్తపల్లిలో ఆదివారం నిర్వహించిన రాతిదూలం లాగుడు పోటీలు అత్యంత ఉత్సాహంగా జరిగాయి. ఎమ్మెల్యే పరిటాల సునీత, గ్రామస్థుల సహకారంతో ఈ పోటీలు నిర్వహించారు. స్థానిక ఉన్నత పాఠశాల మైదానంలో నిర్వహించిన పోటీలకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వృషభాలు పాల్గొన్నాయి. టీడీపీ సీనియర్ నాయకుడు ఎల్ నారాయణచౌదరి పోటీలను ప్రారంభించారు.