Share News

MLA SUNITA : వ్యవసాయానికి సాంకేతికతను జోడిస్తున్నాం

ABN , Publish Date - Sep 25 , 2024 | 12:24 AM

రాష్ట్రంలో వ్యవసాయానికి సాంకేతికతను జోడించి రైతులకు ఆధునిక వ్యవసాయాన్ని అందించేందుకు ప్రభు త్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు. మండల పరిధిలోని ముట్టాల గ్రా మంలో మంగళవారం పొలం పిలుస్తోంది కార్యక్రమం ఆమే పాల్గొన్నారు. ఈ సందర్భంగా కందిపంటలో డ్రోన ద్వారా మందు పిరికారి చేస్తున్న విధానాన్ని పరిశీలించారు.

MLA SUNITA : వ్యవసాయానికి సాంకేతికతను జోడిస్తున్నాం
The farm is calling MLA speaking in the program

ఎమ్మెల్యే పరిటాల సునీత

ఆత్మకూరు, సెప్టెంబరు 24 : రాష్ట్రంలో వ్యవసాయానికి సాంకేతికతను జోడించి రైతులకు ఆధునిక వ్యవసాయాన్ని అందించేందుకు ప్రభు త్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు. మండల పరిధిలోని ముట్టాల గ్రా మంలో మంగళవారం పొలం పిలుస్తోంది కార్యక్రమం ఆమే పాల్గొన్నారు. ఈ సందర్భంగా కందిపంటలో డ్రోన ద్వారా మందు పిరికారి చేస్తున్న విధానాన్ని పరిశీలించారు. ఈ సందర్బంగా సునీత మాట్లాడుతూ... వ్యవసాయాధికారులు రైతులకు అందుబాటులో ఉండి సలహాలు సూచనలు అందించాలని సూచించారు. గ్రామాల్లో ఈ క్రాప్‌ తప్పనిసరిగా చేయాలన్నారు. అదేవిదంగా ఆమె మండలంలో రూ. 2.60కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవ శిలాఫలకాలను ప్రారంభించారు.


ముట్టాలలో రూ. 30లక్షలు, పాపంపల్లిలో రూ. 20లక్షలు, ఆత్మకూరు పంచాయతీలో రూ. 96లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణానికి భూమిపూజ చేశారు. గొరిదిండ్లలో గ్రీనకో సంస్థ ఏర్పాటు చేసిన వాటర్‌ ప్లాంట్‌ను, జడ్పీ ఉన్నత పాఠశాలలో ఆ సంస్థ సౌజన్యంతో ఏర్పాటు చేసిన మినీ సైన్సు ల్యాబ్‌ను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఆ పాఠశాలకు ప్రహరీ, వాటర్‌ ప్లాంటు , అబ్దుల్‌ కలామ్‌ విగ్రహం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రీనకో అధికారులు శరత చంద్ర, బాలాజీ, కిషోర్‌, ప్రసాద్‌, టీడీపీ మండల టీడీపీ కన్వీనర్‌ శ్రీనివాసులు, ముట్టాల ఎంపీటీసీ పారిజాతమ్మ, తెలుగుయువత నారాయణస్వామి, టీఎనఎస్‌ఎఫ్‌ నాయకులు పరుశురామ్‌, శశాంక చౌదరి తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా తిరుపతి పద్మావతి వైద్యకళాశాలో ఉచిత ఎంబీబీఎస్‌ సీటు సాధించిన ఆత్మకూరుకు చెందిన ప్రసాద్‌, సుజాత కుమార్తె నిహారికను ఎమ్మెల్యే అభినందించారు. పార్టీ కార్యలయంలో విద్యార్థినిని సన్మానించారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Sep 25 , 2024 | 12:24 AM