A young farmer : సేద్యానికి ఇంకొకరి బలి
ABN , Publish Date - Jun 16 , 2024 | 12:00 AM
వ్యవసాయం కలిసిరాలేదు. పాతాళ గంగ కరుణించలేదు. మట్టిని నమ్ముకుంటే బతుకు భారమైంది. గొర్రెలనైనా పెంచుకుని భార్యా బిడ్డలను పోషించుకుందామని అనుకున్నాడు. వ్యాధుల బారిన పడి అవీ మృత్యువాత పడ్డాయి. అప్పుల భారం అంతకంతకూ పెరుగుతూనే ఉంది. పూట గడవటం కష్టమైంది. దీంతో జీవితంపై విరక్తి చెందిన యువ రైతు కుర్లపల్లి ఓబులేసు(36) ఉరి వేసుకున్నాడు. ఈ విషాద ఘటన చెన్నేకొత్తపల్లి మండలం చిన్నప్పేట గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. ఓబులేసుకు మూడున్నర ఎకరాల పొలం ఉంది. కొన్నేళ్ల నుంచి ...
వ్యవసాయం కలిసిరాలేదు. పాతాళ గంగ కరుణించలేదు. మట్టిని నమ్ముకుంటే బతుకు భారమైంది. గొర్రెలనైనా పెంచుకుని భార్యా బిడ్డలను పోషించుకుందామని అనుకున్నాడు. వ్యాధుల బారిన పడి అవీ మృత్యువాత పడ్డాయి. అప్పుల భారం అంతకంతకూ పెరుగుతూనే ఉంది. పూట గడవటం కష్టమైంది. దీంతో జీవితంపై విరక్తి చెందిన యువ రైతు కుర్లపల్లి ఓబులేసు(36) ఉరి వేసుకున్నాడు. ఈ విషాద ఘటన చెన్నేకొత్తపల్లి మండలం చిన్నప్పేట గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. ఓబులేసుకు మూడున్నర ఎకరాల పొలం ఉంది. కొన్నేళ్ల నుంచి వేరుశనగ, మొక్కజొన్న తదితర పంటలను సాగుచేసేవాడు. బోరు బావిలో నీరు
తగ్గడంతో పంటలను కాపాడుకునేందుకు మరిన్ని బోర్లు తవ్వించాడు. చుక్కనీరు పడకపోవడంతో తీవ్రంగా నష్టపోయాడు. ఈ క్రమంలో అప్పులు రూ.10 లక్షలు దాటాయి. కుటుంబ పోషణ భారం కావడంతో కొన్ని గొర్రెలను కొని పెంచడం ప్రారంభించాడు. వ్యాధుల బారిన పడి అవి కూడా మృతిచెందాయి. దీంతో జీవితంపై విరక్తి చెందాడు. పొలం వద్దకు వెళ్లొస్తానని శుక్రవారం రాత్రి భార్య శ్రీతేజకు చెప్పి వెళ్లిపోయాడు. తెల్లవారేదాకా తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు, బంఽధువులు వెళ్లి గాలించారు. వంక గట్టున కానుగ చెట్టుకు ఉరివేసుకుని కనిపించాడు. ఓబులేసుకు కుమారుడు, కూతురు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని ధర్మవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రైతు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్థులు కోరారు. - చెన్నేకొత్తపల్లి
మరిన్ని అనంతపురం వార్తల కోసం....