CM Chandrababu: అనంతలో సీఎం చంద్రబాబు పర్యటన షెడ్యూల్ ఇదే
ABN , Publish Date - Nov 29 , 2024 | 09:42 AM
Andhrapradesh: రేపు (శనివారం) అనంతలో పర్యటించనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాయదుర్గం నియోజకవర్గం బొమ్మనహళ్ మండలం నేమకల్లులో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ చేయనున్నారు. అనంతరం గ్రామస్తులతో సమావేశమై అర్జీలను స్వీకరించనున్నారు. సీఎం పర్యటన సందర్భంగా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.
అనంతపురం, నవంబర్ 29: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) రేపు (శనివారం) జిల్లాలో పర్యటించనున్నారు. ఎన్టీఆర్ భరోసా పించన్లను పంపిణీ చేసేందుకు ముఖ్యమంత్రి జిల్లాకు రానున్నారు. అలాగే గ్రామస్థులతో సమావేశమవుతారు. జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన సందర్భంగా ఆయన ఏ సమయంలో జిల్లాకు చేరుకుంటారు, ఎక్కడెక్కడ పర్యటించనున్నారు అనేదానిపై సీఎంవో షెడ్యూల్‌ను ఖరారు చేసింది.
సచివాలయ ఉద్యోగుల సంఘం నేత వెంకట్రామి రెడ్డి అరెస్టు
రేపు అనంతలో పర్యటించనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాయదుర్గం నియోజకవర్గం బొమ్మనహళ్ మండలం నేమకల్లులో ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేయనున్నారు. అనంతరం గ్రామస్తులతో సమావేశమై అర్జీలను స్వీకరించనున్నారు. సీఎం పర్యటన సందర్భంగా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.
సీఎం పర్యటన షెడ్యూల్
* రేపు( శనివారం) ఉదయం 11 గంటలకు తాడేపల్లిలోని నివాసం నుంచి రోడ్డు మార్గాన విజయవాడ విమానాశ్రాయానికి బయలుదేరుతారు.
* 11:40 గంటలకు విజయవాడ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి విమానంలో బయలుదేరి మధ్యాహ్నం 12.25 గంటలకు బెంగళూరు విమానాశ్రాయానికి చేరుకుంటారు.
* 12:45 గంటలకు బెంగళూరు విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలిక్యాప్టర్లో నేమకల్లు హెలిప్యాడ్‌కు చేరుకుంటారు.
* 12:45 గంటల నుంచి 12:50 గంటల వరకూ ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తారు.
* 12:50 గంటల నుంచి 1:20 గంటల వరకూ విశ్రాంతి తీసుకుంటారు.
* 1:20 గంటలకు హెలిప్యాడ్ నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి 1:25 గంటలకు నేమకల్లు ఇందిరమ్మ కాలనీకి చేరుకుంటారు.
* 1:25 గంటల నుంచి 1:55 గంటల వరకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లను లబ్దిదారులకు పంపిణీ చేస్తారు.
* 1:55 గంటల నుంచి 2:00 గంటల వరకు నేమకల్లులోని ఆంజనే యస్వామిని దర్శించుకుంటారు. ఆ తరువాత 3:05 గంటల వరకు గ్రామస్తులతో సమావేశమవుతారు.
* మధ్యాహ్నం 3:10 గంటలకు నేమకల్లు హెలిప్యాడ్కు చేరుకొని 3:15 గంటల వరకూ She's నుంచి అర్జీలు స్వీకరిస్తారు.
* 3:45 గంటలకు హెలీకాఫ్టర్‌లో బెంగళూరుకు బయలుదేరుతారు.
ఇవి కూడా చదవండి...
సచివాలయ ఉద్యోగుల సంఘం నేత వెంకట్రామి రెడ్డి అరెస్టు
లాక్ చేసిన స్కూటీ చోరీ.. ఈ దొంగ తెలివి మామూలుగా
Read Latest AP News And Telugu News