MLA SUNITHA: ఏపీ నంబర్ వనగా నిలుస్తుంది
ABN , Publish Date - Dec 14 , 2024 | 12:24 AM
రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ ధ్వర్యంలో ఏపీ నెంబర్ వనగా ని లుస్తుందని రాప్తాడు ఎమ్మె ల్యే పరిటాల సునీత, ధర్మవరం టీ డీపీ ఇనచార్జి పరిటాల శ్రీరామ్ అన్నారు.
అనంతపురం అర్బన, డిసెంబరు 13(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ ధ్వర్యంలో ఏపీ నెంబర్ వనగా ని లుస్తుందని రాప్తాడు ఎమ్మె ల్యే పరిటాల సునీత, ధర్మవరం టీ డీపీ ఇనచార్జి పరిటాల శ్రీరామ్ అన్నారు. శుక్రవారం నగరంలోని వారి నివాసంలో స్వర్ణాం ధ్ర విజన-2047 పోస్టర్లను వారు విడుదల చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ సీఎం చంద్రబాబుకు ఉన్నంత దూరదృష్టి మరెవరికీ లేదన్నారు. 2047 నాటికి రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలిపేలా స్వర్ణాంధ్ర విజన డాక్యుమెంట్ ఉందన్నారు. అంతలోపే రాష్ట్రం నెంబర్1గా మారుతుందన్న నమ్మకం తమకుందన్నారు. గత వైసీపీ పాలనలో రాష్ట్రం అన్నివిధాలుగా వెనుకబడిందన్నారు. చంద్రబాబు సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత నాశమైన వ్యవస్థలను గాడిలో పెడుతున్నారన్నారు. అందరికీ ఆరోగ్యం, సంపద, సంతోషం లక్ష్యంగా స్వర్ణాంధ్ర విజన ముఖ్య ఉద్దేశ్యమన్నారు. మిగిలిన రాష్ర్టాలకు ఈ విజన మార్గదర్శకంగా ఉంటుందన్నారు.