Share News

SPORTS : అథ్లెటిక్స్‌లో అదరగొట్టిన ఆర్ట్స్‌ కళాశాల

ABN , Publish Date - Dec 09 , 2024 | 12:27 AM

ఎస్కేయూ ఆధ్వర్యంలో నిర్వహించిన అథ్లెటిక్‌ పోటీల్లో ఆర్ట్స్‌ కళాశాల వి ద్యార్థులు ఆసాధారణ ప్రతిభ కనబరిచారు. మహిళా విభాగంలో 62, పురుషల విభాగంలో 64 ప్రకారం మొత్తం 127 పాయింట్లతో ఓరాల్‌ చాం పియన్లుగా నిలిచారు. స్థానిక ఆర్ట్స్‌ కళాశాల మైదానంలో రెండు రోజులు గా నిర్వహిస్తున్న శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ అంతర్‌ కళాశాలల అథ్లెటిక్‌ చాంపియన షిప్‌-2024 పోటీలు ఆదివారం ముగిశాయి.

SPORTS : అథ్లెటిక్స్‌లో అదరగొట్టిన ఆర్ట్స్‌ కళాశాల
Sports Director Jesse, College Principal Padmasree congratulating the winners

అనంతపురం సెంట్రల్‌ / క్లాక్‌టవర్‌, డిసెంబరు 8 (ఆంధ్రజ్యోతి) : ఎస్కేయూ ఆధ్వర్యంలో నిర్వహించిన అథ్లెటిక్‌ పోటీల్లో ఆర్ట్స్‌ కళాశాల వి ద్యార్థులు ఆసాధారణ ప్రతిభ కనబరిచారు. మహిళా విభాగంలో 62, పురుషల విభాగంలో 64 ప్రకారం మొత్తం 127 పాయింట్లతో ఓరాల్‌ చాం పియన్లుగా నిలిచారు. స్థానిక ఆర్ట్స్‌ కళాశాల మైదానంలో రెండు రోజులు గా నిర్వహిస్తున్న శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ అంతర్‌ కళాశాలల అథ్లెటిక్‌ చాంపియన షిప్‌-2024 పోటీలు ఆదివారం ముగిశాయి. ఓవరాల్‌ చాంపియనగా ఆర్ట్స్‌ కళాశాల, ద్వితీయ స్థానంలో ఎస్‌ఎస్‌బీఎన, తృతీయ స్థానంలో హిందూపురం ఎస్‌డీజీఎస్‌ కళాశాల, నాలుగో స్థానంలో గుత్తి పీ ఆర్‌ఆర్‌ఎంఎస్‌ కళాశాల నిలిచాయి. విజేతలకు ఎస్కేయూ స్పోర్ట్స్‌ సెక్ర టరీ జెస్సీ, ఆర్ట్స్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ పద్మశ్రీ చేతుల మీదుగా బహుమతు లు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో కార్యనిర్వాహక కార్యదర్శి శ్రీరామ్‌, అథ్లెటిక్‌ కోచలు, పీడీలు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Dec 09 , 2024 | 12:27 AM