PARITALA SRIRAM: ఆయకట్టు రైతులకు ఉపయోగపడండి
ABN , Publish Date - Dec 22 , 2024 | 12:01 AM
కరువు ప్రాంతమైన ముదిగుబ్బ మండలంలోని యోగివేమన ప్రాజెక్టు నిర్మాణ లక్ష్యాన్ని నెరవేరుద్దామని నూతన కమిటీ సభ్యులతో నియోజకవర్గ టీడీపీ ఇనచార్జ్ పరిటాలశ్రీరామ్ అన్నారు.
ధర్మవరం, డిసెంబరు 21(ఆంధ్రజ్యోతి): కరువు ప్రాంతమైన ముదిగుబ్బ మండలంలోని యోగివేమన ప్రాజెక్టు నిర్మాణ లక్ష్యాన్ని నెరవేరుద్దామని నూతన కమిటీ సభ్యులతో నియోజకవర్గ టీడీపీ ఇనచార్జ్ పరిటాలశ్రీరామ్ అన్నారు. శనివారం యోగివేమన రిజర్వాయర్‌కు ఎన్నికలు జరగ్గా చైర్మన, వైస్‌చైర్మనలు ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. చైర్మనగా జయప్రకాశనాయుడు, వైస్‌చైర్మనగా డేగల శివయ్య ఎంపికయ్యారు. వారు నూతన కమిటీ సభ్యులతో కలిసి అనంతపురంలోని పరిటాలశ్రీరామ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రాజెక్టు పరిధిలో ఎలాంటి విభేదాలు లేకుండా ఏకగ్రీవంగా ఎన్నికలు నిర్వహించడం పట్ల ఆయన అభినందించారు. ప్రాజెక్టు నిర్మాణం నుంచి పూర్తీస్థాయిలో నీరు వచ్చి ఆయకట్టుకు నీరందించే పరిస్థితులు లేవని, ఇక నుంచి ఆయకట్టు రైతులకు ఉపయోగపడే విధంగా పనిచేయాలని వారికి శ్రీరామ్ సూచించారు. ప్రాజెక్టుకు పూర్తిస్థాయి నీరు తెచ్చేలా కృషిచేస్తామన్నారు. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకెళ్లి ప్రాజెక్టు నిర్మాణ ఉద్దేశ్యాన్ని నెరవేరుస్తానని పరిటాలశ్రీరామ్ హామీ ఇచ్చారు.
చైర్మన, వైస్‌చైర్మన్ల ఏకగ్రీవం
ముదిగుబ్బ, డిసెంబరు 21(ఆంధ్రజ్యోతి): ముదిగుబ్బ మండలంలోని యోగివేమన రిజర్వాయర్ చైర్మన, వైస్‌చైర్మనలను శనివారం ఏకగ్రీవంగా ఎంపికచేసినట్టు హంద్రీనీవా సుజలస్రవంతి ఈఈ మురళి తెలిపారు. ప్రాజెక్టు చైర్మనగా జయప్రకాశనాయుడు, వైస్‌చైర్మనగా డేగల శివయ్యలను ఎంపిక చేసినట్టు ఆయన తెలిపారు. చైర్మన, వైస్ చైర్మనలను టీడీపీ మండల కన్వీనర్ కరణం ప్రభాకర్, క్లస్టర్ ఇనచార్జి తుమ్మల మనోహర్, నాయకులు కోట్లబాబీ సత్కరించారు. ప్రాజెక్టు అభివృద్ధితోపాటు రైతులకు న్యాయం జరిగేవిధంగా చూడాలన్నారు.