Share News

MLA SHRAVANISREE ; టీడీపీతోనే మెరుగైన పాలన

ABN , Publish Date - Oct 01 , 2024 | 12:19 AM

వైసీపీ పాలనలో పుట్టిన బిడ్డకు ప్రభుత్వం ఇచ్చే బేబీ కిట్స్‌ లేవని, ప్రభుత్వ వైద్యాన్ని నిర్లక్ష్యం చేశారని ఎ మ్మెల్యే బండారు శ్రావణిశ్రీ విమర్శించారు. అదే టీడీపీ పాలనలో ప్రతి గ్రా మంలో మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నామని అన్నారు. ఆమె సోమవారం శింగనమలలో సుడిగాలి పర్యటన చేశారు. కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌, పోలీస్‌స్టేషన, సివిల్‌ సప్లై గోడౌన, ఆర్‌టీసీ బస్టాండ్‌, కళాశాల ఆటస్థలం, ట్రెజరీ తహసీల్దార్‌ కార్యాలయం, అంగనవాడీ కేంద్రం, కెనరా బ్యాంకును పరిశీలించారు.

MLA SHRAVANISREE ; టీడీపీతోనే మెరుగైన పాలన
MLA talking to patients about medical services at the hospital

ఎమ్మెల్యే శ్రావణిశ్రీ

శింగనమలలో సుడిగాలి పర్యటన

శింగనమల, సెప్టెంబరు 30: వైసీపీ పాలనలో పుట్టిన బిడ్డకు ప్రభుత్వం ఇచ్చే బేబీ కిట్స్‌ లేవని, ప్రభుత్వ వైద్యాన్ని నిర్లక్ష్యం చేశారని ఎ మ్మెల్యే బండారు శ్రావణిశ్రీ విమర్శించారు. అదే టీడీపీ పాలనలో ప్రతి గ్రా మంలో మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నామని అన్నారు. ఆమె సోమవారం శింగనమలలో సుడిగాలి పర్యటన చేశారు. కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌, పోలీస్‌స్టేషన, సివిల్‌ సప్లై గోడౌన, ఆర్‌టీసీ బస్టాండ్‌, కళాశాల ఆటస్థలం, ట్రెజరీ తహసీల్దార్‌ కార్యాలయం, అంగనవాడీ కేంద్రం, కెనరా బ్యాంకును పరిశీలించారు. ఆసుపత్రిలో రాత్రిళ్లు డాక్టర్‌ అందుబాటులో ఉడడంలేదని, ఎక్స్‌రే యత్రాలు సక్రమంగాలేదని, సదరం క్యాంపులపై ఫిర్యాదులు వచ్చా యని ఎమ్మెల్యే అన్నారు. రాత్రిపూట డాక్టర్‌ ఉండాలని ఆదేశించారు. ఎక్స్‌రే యత్రాల మరమ్మతులను వెంటనే చేయిస్తామని, సదరం క్యాంపు డాక్టర్‌పై చర్యలు తప్పవన్నారు.


అలాగే అంగనవాడీ కేంద్రంలో చిన్న కోడిగుడ్లు ఇస్తున్నారని తమ దృష్టికి వచ్చిందని, ఏజెన్సీవారు తప్పక 50గ్రాముల గు డ్లు సరఫరా చేయాలన్నారు. అలాగే అంగనవాడీ కేంద్రానికి విద్యుత సౌ కర్యం కల్పించాలని, ప్రహరీ నిర్మించాలని, ఆవరణలో పిచ్చిమెక్కలు తొల గించాలని సంబంధిత ఆధికారులను ఆదేశించారు. కార్డు దారులకు రేషన సరుకుల్లో తూకాలు తక్కవగా వేస్తున్నారని ఫిర్యాదులు వస్తున్నాయని, గోడౌన నుంచి డీలర్లకు సరైన తూకాలు ఇవ్యాలని సివిల్‌ సప్లై అధికారులకు సూచించారు. అదేవిధంగా రెండు రోజల కిందట శింగనమలకు చెందిన టీడీపీ యవ నాయకుడు సుధాకర్‌యాదవ్‌ గుండె పోటుతో మృతి చెందగా... ఎమ్మెల్యే ఆ ఇంటి వద్దకు వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఎమ్మెల్యే వెంట ఎంపీడీఓ నిర్మిలాకుమారి, వైద్యాధికారి ప్రవీణ్‌కుమార్‌ ఎంఈఓ నరసింహరాజు, ఈఓఆర్డీ మురళీకృష్ణ, మాజీ జడ్పీటీసీ షాలిని టీడీపీ నాయకులు వెంకటేశ, నాగముని తదితరులు పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Oct 01 , 2024 | 12:19 AM