Share News

Former IAS officer Lakshminarayana : దుర్మార్గపు పాలనను పెకిలించండి

ABN , Publish Date - Apr 21 , 2024 | 02:52 AM

వైసీపీ దుర్మార్గపు పాలనను కూకటి వేళ్లతో పెకిలించే సమయం ఆసన్నమైందని మాజీ ఐఏఎస్‌ అధికారి లక్ష్మినారాయణ అన్నారు. పట్టణంలోని సత్యం కన్వెన్షన హాల్‌లో శనివారం నిర్వహించిన టీడీపీ సీనియర్‌ కార్యకర్తలు, తటస్తుల సమావేశంలో ఆయన ప్రసంగించారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన పార్టీ టీడీపీ అని అన్నారు. తెలుగువారు ప్రపంచవ్యాప్తంగా తలెత్తుకునేలా చేసిన వ్యక్తి ఎన్టీఆర్‌ అని అన్నారు.

 Former IAS officer Lakshminarayana : దుర్మార్గపు పాలనను  పెకిలించండి
Lakshminarayana speaking at the meeting

మాజీ ఐఏఎస్‌ అధికారి లక్ష్మీనారాయణ

ఉరవకొండ, ఏప్రిల్‌ 20: వైసీపీ దుర్మార్గపు పాలనను కూకటి వేళ్లతో పెకిలించే సమయం ఆసన్నమైందని మాజీ ఐఏఎస్‌ అధికారి లక్ష్మినారాయణ అన్నారు. పట్టణంలోని సత్యం కన్వెన్షన హాల్‌లో శనివారం నిర్వహించిన టీడీపీ సీనియర్‌ కార్యకర్తలు, తటస్తుల సమావేశంలో ఆయన ప్రసంగించారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన పార్టీ టీడీపీ అని అన్నారు. తెలుగువారు ప్రపంచవ్యాప్తంగా తలెత్తుకునేలా చేసిన వ్యక్తి ఎన్టీఆర్‌ అని అన్నారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి నీతివంతమైన పాలన అందించిన ఘనత ఎన్టీఆర్‌కే దక్కుతుందని అన్నారు.


చంద్రబాబు విజన ఉన్న నాయకుడని కొనియాడారు. టీడీపీ హయాంలోనే ఎస్సీలకు కార్పొరేషన ఏర్పాటు చేసి నిధులు కేటాయించారని అన్నారు. అరాచక, ముఠా రాజకీయలకు పాల్పడుతున్న పార్టీకి బుద్ధి చెప్పాలని పిలుపినిచ్చారు. వైసీపీ ప్రభుత్వం సామాన్య ప్రజల జీవితాలతో ఆడుకుంటోందని మండిపడ్డారు. ఈ ఐదేళ్లలో సహజవనరులను లూటీ చేశారని, హత్యలు, దౌర్జన్యాలు చేశారని విమర్శించారు. ప్రజా స్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి భుజస్కందాలపై ఉందని అన్నారు.


మన పిల్లల భవిష్యత్తుకోసం దూరదృష్టితో ఆలోచించి, సుపరిపాలన అందించే టీడీపీకి పట్టం కట్టాలని కోరారు. ఎంపీ అభ్యర్థి అంబికా లక్ష్మినారాయణ, ఎమ్మెల్యే అభ్యర్థి కేశవ్‌ను గెలిపించాలని కోరారు. సమావేశంలో టీడీపీ నాయకులు గుర్రం చెన్నకేశవులు, నాగన్న, ఆదెన్న, గొర్తి శ్రీరాములు, రెడ్డి మాసి సత్యన్న, సోముశేఖర్‌నాయుడు, న్యాయవ్యాది రాజేంద్రప్రసాద్‌ బాబు, మాజా ఎంపీపీలు నాగేశ్వరరరావు, కుళ్లాయప్ప, మాజీ సర్పంచు గోవిందు, నర్రాకేశన్న, పోతుల మల్లికార్జున పాల్గొన్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..

Updated Date - Apr 21 , 2024 | 02:52 AM