చదం గొల్లలదొడ్డిలో కార్డెన సెర్చ్
ABN , Publish Date - May 27 , 2024 | 11:48 PM
మండలంలోని చదం గొల్లలదొడ్డి గ్రామంలో సీఐ శ్రీనివాసులు ఆధ్వర్యంలో కార్డెన సెర్చ్ నిర్వహించారు. సోమవారం గ్రామాన్ని సందర్శించి ఇళ్లలో పాకల్లో గడ్డివాముల్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు.
రాయదుర్గంరూరల్, మే 27: మండలంలోని చదం గొల్లలదొడ్డి గ్రామంలో సీఐ శ్రీనివాసులు ఆధ్వర్యంలో కార్డెన సెర్చ్ నిర్వహించారు. సోమవారం గ్రామాన్ని సందర్శించి ఇళ్లలో పాకల్లో గడ్డివాముల్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఎన్నికల ఓట్ల లెక్కింపు రోజు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సీఐ గ్రామస్థులకు సూచించారు. ఎన్నికల నిబంధనలు ఎవరైనా అతిక్రమిస్తే చర్యలు తప్పవన్నారు. గ్రామంలో కవాతు నిర్వహించి ఎలాంటి గొడవలు, అల్లర్లు జరుగకుండా వుండాలని సూచించారు. అభ్యర్థులు గెలిచినప్పుడు టపాసులు పేల్చరాదన్నారు. ర్యాలీ నిర్వహించకుండా ప్రశాంతంగా వుండాలన్నారు. మూడు మండలాల ఎస్‌ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
పెద్దవడుగూరు: మండలంలోని మేడిమాకులపల్లి గ్రామంలో ఎస్‌ఐ శ్రీనివాసులు ఆధ్వర్యంలో సోమవారం కార్డెనసెర్చ్ నిర్వహించారు. రౌడీషీటర్లు, పాతకేసుల్లోని నిందితుల ఇళ్లల్లో, షెడ్డుల్లో, గడ్డివాముల్లో సోదాలు నిర్వహించారు. అనంతరం గ్రామంలో పోలీసు బలగాలు కవాతు నిర్వహించాయి. కౌంటింగ్‌రోజు ఎలాంటి గొడవలు, అల్లర్లకు పాల్పడరాదని గ్రామస్థులను ఎస్‌ఐ హెచ్చరించారు.