Scam : వసూళ్లు విభిన్నం..!
ABN , Publish Date - Dec 11 , 2024 | 12:55 AM
విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖలో ఓ అధికారి కమీషనల వేట సాగిస్తున్నాడు. ఏది కావాలన్నా చేతులు తడపాల్సిందే అంటున్నాడు. లేదంటే ఫైళ్లను పక్కన పడేస్తున్నాడు. దివ్యాంగులకు ప్రభుత్వం అందజేస్తున్న మోటార్ సైకిళ్లు, ల్యాప్‌టా్‌పలు, వినికిడి లోపం ఉన్నవారికి అందించే పరికరాల విషయంతో చేతివాటం ప్రదర్శించాడని ఆరోపణలు వస్తున్నాయి. వసతి గృహాలకు చేరా...
చేయి తడిపితేనే పరికరాలు, వాహనాలు
నాణ్యమైన బియ్యం కనిపిస్తే కాజేయడమే..!
విభిన్న ప్రతిభావంతుల శాఖలో ఓ అధికారి తీరిది
ఫిర్యాదులు వెళ్లినా పట్టించుకోని జిల్లా అధికారులు
అనంతపురం ప్రెస్‌క్లబ్, డిసెంబరు 10(ఆంధ్రజ్యోతి): విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖలో ఓ అధికారి కమీషనల వేట సాగిస్తున్నాడు. ఏది కావాలన్నా చేతులు తడపాల్సిందే అంటున్నాడు. లేదంటే ఫైళ్లను పక్కన పడేస్తున్నాడు. దివ్యాంగులకు ప్రభుత్వం అందజేస్తున్న మోటార్ సైకిళ్లు, ల్యాప్‌టా్‌పలు, వినికిడి లోపం ఉన్నవారికి అందించే పరికరాల విషయంతో చేతివాటం ప్రదర్శించాడని ఆరోపణలు వస్తున్నాయి. వసతి గృహాలకు చేరాల్సిన బియ్యాన్ని పక్కదారి పట్టించారని ప్రచారం జరుగుతోంది. ఆ అధికారిపై ఉన్నతాధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని
దివ్యాంగులు, సంఘాల నాయకులు విమర్శిస్తున్నారు.
దేన్నీ వదలరా..?
- సార్వత్రిక ఎన్నికల సమయంలో దివ్యాంగులు ఓటు వేసేందుకు వీల్ చైర్లు అవసరమని అధికారులు గుర్తించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 576 వీల్‌చైర్లు అవసరమని నివేదికలు తయారు చేశారు. ఓ కమిటీ ఆధ్వర్యంలో టెండర్లు పిలవగా.. ముగ్గురు వ్యక్తులు దక్కించుకున్నారు. వారితో ఆ అధికారి కమీషన ఒప్పందం చేసుకున్నారని, మొత్తం బడ్జెట్ రూ.28.80 లక్షలు కాగా, రూ.6 లక్షలకు పైగా కమీషన తీసుకున్నాడని ఆరోపణలు ఉన్నాయి.
- కార్పొరేషన సబ్సిడీ రుణాల మంజూరులో ఆ అధికారి ఇష్టారాజ్యంగా వ్యవహరించారని బాధితులు వాపోతున్నారు. యూనిట్ల ప్రకారం అర్హులకు రుణాలు అందించకుండా, కాసులు ముట్టజెప్పిన వారికి ఇచ్చారని బాధితులు వాపోతున్నారు. ఒక్కో రుణానికి రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకూ కమీషన తీసుకున్నాడని ఆరోపణలు ఉన్నాయి. దీనిపై ప్రశ్నిస్తే.. పొంతనలేని సమాధానాలు చెబుతున్నారని అర్హులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా అధికారులకు ఫిర్యాదు చేసినా.. రాష్ట్రస్థాయిలోని కొందరు అధికారుల అండతో బయటపడుతున్నారని అంటున్నారు.
- వార్డెనల డైట్ బిల్లుల విషయంలో ఆ అధికారికి మామూళ్లు చెల్లించాల్సిందే అంటున్నారు. లేదంటే ఫైళ్లు ముందుకు కదలదని అంటున్నారు. కార్యాలయ నిర్వహణకు, క్యాంపు ఖర్చులకు వార్డెన్ల నుంచే డబ్బులు వసూలు చేస్తున్నట్లు సమాచారం. కార్యాలయ సిబ్బందిలో కొందరితో రూ.లక్షలు ఖర్చు పెట్టించి, ఆ డబ్బులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని చర్చ జరుగుతోంది.
- వసతి గృహాలలో దివ్యాంగులు, అంధులకు సరఫరా అయ్యే బియ్యాన్ని ఆ అధికారి పక్కదారి పట్టిస్తున్నారు. తనిఖీల పేరిట వెళ్లి.. నాణ్యమైన బియ్యం కనిపిస్తే ఇంటికి తరలిస్తారని ప్రచారం జరుగుతోంది. విద్యార్థులకు తక్కువ వస్తాయని చెప్పినా.. వినిపించుకోవడం లేదని అంటున్నారు.
చేతులు తడపాల్సిందే..
విభిన్న ప్రతిభావంతులకు పరికరాల పంపిణీలోనూ ఆ అధికారి వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. చంక కర్రలు కావాలంటే రూ.200, వినికిడి యంత్రాలకు రూ.700, వీల్ చైర్‌లకు రూ.2 వేలు, ట్రై సైకిళ్లకు రూ.1000 వసూలు చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. అదే బైక్ ఇస్తే రూ.20 వేలకు పైగా తీసుకుంటున్నారని సమాచారం. విషయం తెలుసుకున్న ఓ ప్రజాప్రతినిధి పంపిణీ కార్యక్రమంలోనే ఆ అధికారిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ల్యాప్‌టా్‌పలు ఇవ్వకుండా రోజుల తరబడి విద్యార్థులను తిప్పుకున్నారని సమాచారం. ఒక్కో ల్యాప్‌టా్‌పకు రూ.10 వేల దాకా వసూలు చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....