Share News

GRIEVENCE: ఫిర్యాదులను సత్వరం పరిష్కరించాలి

ABN , Publish Date - Nov 25 , 2024 | 11:43 PM

ప్రజాఫిర్యాదులను సత్వ రం పరిష్కరించాలని కలెక్టర్‌ టీఎస్‌ చేతన.. అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్‌లో సోమవారం ప్రజాఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్ర మం నిర్వహించారు.

GRIEVENCE: ఫిర్యాదులను సత్వరం పరిష్కరించాలి
Collector aware of the problem of the disabled

పుట్టపర్తి టౌన, నవంబరు25(ఆంధ్రజ్యోతి): ప్రజాఫిర్యాదులను సత్వ రం పరిష్కరించాలని కలెక్టర్‌ టీఎస్‌ చేతన.. అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్‌లో సోమవారం ప్రజాఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్ర మం నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి 215 మంది వివిధ సమస్యలపై వినతిపత్రాలు అందించారు. వాటిని కలెక్టర్‌ స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజాఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం తగదన్నారు. సత్వరం పరిష్కరించాలని ఆదేశించారు.

దివ్యాంగుడి సమస్య పరిష్కారం

కనగానపల్లి మండలం తల్లిమడుగు గ్రామానికి చెందిన సుకన్య, అశోక్‌ దంపతుల కుమారుడు నీలకంఠేశ్వర్‌ నడవలేని స్థితిలో కలెక్టరేట్‌కు వచ్చాడు. దీనిని గమనించిన కలెక్టర్‌ చేతన స్వయంగా వారి వద్దకెళ్లి సమస్యను ఆరాతీశారు. దివ్యాంగుడైన తమ కుమారుడి పింఛన ఏడాది క్రితం తొలగించారని విన్నవించారు. తక్షణమే పింఛన పునరుద్ధరించాలని కలెక్టర్‌ ఆదేశించారు.

డీపీఓలో..

పుట్టపర్తిరూరల్‌(ఆంధ్రజ్యోతి): స్థానిక జిల్లా పోలీసు కార్యాలయం (డీపీఓ)లో నిర్వహించిన ప్రజాఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజలు 38 ఫిర్యాదులు సమర్పించారు. వాటిని ఎస్పీ రత్న స్వీకరించారు. తక్షణమే సంబంధిత అధికారులతో ఫోనలో మాట్లాడారు. ఫిర్యాదులను చట్టపరిధిలో వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఏఎస్పీ ఆర్ల శ్రీనివాసులు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Nov 25 , 2024 | 11:43 PM