CRICKET : క్రికెట్ ఎంపిక పోటీల్లో గందరగోళం
ABN , Publish Date - Dec 30 , 2024 | 12:36 AM
క్రికెట్ క్రీడాకారుల ఎంపిక పోటీల్లో గందరగోళం నెలకొంది. అండర్-12 బాలుర జిల్లా క్రికెట్ జట్టు ప్రాబబుల్స్ ఎంపిక పోటీలు ఆదివారం స్థానిక అనంత క్రీడాగ్రామంలో నిర్వ హించారు. అయితే 12ఏళ్ల వయస్సు పైబడిన, హైదరా బాద్, బెంగళూరులలో నివాసముంటూ, అక్కడే ప్రాక్టీస్ చేస్తున్న క్రీడాకారులను జిల్లా జట్టుకు ఎలా ఎంపిక చేస్తా రంటూ కొందరు క్రీడాకారుల తల్లిదండ్రులు నిరసనకు దిగారు.
అనర్హులకు చోటు కల్పించారంటూ ఆందోళన
అనంతపురం క్లాక్‌టవర్, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): క్రికెట్ క్రీడాకారుల ఎంపిక పోటీల్లో గందరగోళం నెలకొంది. అండర్-12 బాలుర జిల్లా క్రికెట్ జట్టు ప్రాబబుల్స్ ఎంపిక పోటీలు ఆదివారం స్థానిక అనంత క్రీడాగ్రామంలో నిర్వ హించారు. అయితే 12ఏళ్ల వయస్సు పైబడిన, హైదరా బాద్, బెంగళూరులలో నివాసముంటూ, అక్కడే ప్రాక్టీస్ చేస్తున్న క్రీడాకారులను జిల్లా జట్టుకు ఎలా ఎంపిక చేస్తా రంటూ కొందరు క్రీడాకారుల తల్లిదండ్రులు నిరసనకు దిగారు. అనంత క్రికెట్ గ్రౌండ్-బి లో ఎంపిక మ్యాచ నిర్వహించేందుకు జిల్లా క్రికెట్ సంఘం ఏర్పాట్లు చేసింది. అయితే అర్హత ఉన్నా జట్టులో స్థానం దక్కని క్రీడాకారుల తల్లిదండ్రులు మ్యాచను అడ్డుకున్నారు. స్టేడియంలో బైఠా యించి నిరసన తెలిపారు. విషయం తెలుసుకున్న రాప్తా డు సీఈ శ్రీహర్ష అక్కడకు చేరుకుని బాధిత క్రీడాకారుల తల్లిదండ్రులతోనూ, జిల్లా క్రికెట్ సంఘం సభ్యులతోనూ చర్చించి సామరస్యంగా సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు. సెలెక్షన కమిటీ, జిల్లా క్రికెట్ సంఘం పరప తి ఉన్న, డబ్బులు ఇచ్చిన వారి పిల్లలనే సెలెక్ట్ చేస్తున్నా రని, ఇందుకు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని తల్లిదం డ్రులు మండిపడ్డారు. కలెక్టర్‌కు ఫిర్యాదు చేసేందుకు శని వారం కలెక్టరేట్‌కు వెళ్లగా, అక్కడ ఇనచార్జి కలెక్టర్‌గా ఉన్న జాయింట్ కలెక్టర్ కలవడానికి అనుమతించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తం ప్రాబబుల్స్‌కు 28మందిని ఎంపిక చేయగా, ఇందులో సుమారు 11మంది 12ఏళ్ల వయస్సు పై బడి, స్థానికేతరులు ఉన్నారన్నారు. సెలెక్షన కమిటీ చైర్మన గా కమలాకర్‌నాయుడు అనర్హుడని, ఏకపక్షంగా చేస్తున్నా రని తల్లిదండ్రులు ఆరోపించారు. జిల్లా క్రికెట్ సంఘం అ ధ్యక్షుడు పీఎల్ ప్రకాష్‌రెడ్డి, ఇనచార్జి సెక్రటరీ భీమలింగా రెడ్డి మాట్లాడుతూ... బీసీసీఐ, ఏసీఏ నిబంధనల మేరకే జిల్లా అండర్-12 బాలుర జట్టు ఎంపిక పోటీలు నిర్వహి స్తున్నామని, ఇందులో ఎటువంటి అపోహలకు తావులేద న్నారు. అర్హులకే అవకాశం కల్పిస్తున్నామని వివరించారు. అర్హులైన క్రీడాకారులకు న్యాయం చేస్తామన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....