TDP : మామిడి మొక్కల నరికివేత
ABN , Publish Date - Jul 19 , 2024 | 11:43 PM
మండల పరిధిలోని వీరన్నపల్లి గ్రామంలో టీడీపీ వర్గీయుల మామిడి మొక్కలను వైసీపీ వర్గీయులు నరికేశారు. రెడ్డప్పరెడ్డి, భరతకుమార్ సోదరుల తోటలో మూడేళ్ల వయసుగల 120 మామిడి మొక్కలను గురువారం అర్ధరాత్రి నరికేశారు. తామిద్దరం గురువారం రాత్రి తోటవద్దకు వెళ్లామని, ఆ సమయంలో తమ గ్రామానికి చెందిన వైసీపీ వర్గీయులు గోపాల్, శ్రీనివాసులు, ...
వీరన్నపల్లిలో వైసీపీ దుశ్చర్య
పెద్దవడుగూరు, జూలై 19: మండల పరిధిలోని వీరన్నపల్లి గ్రామంలో టీడీపీ వర్గీయుల మామిడి మొక్కలను వైసీపీ వర్గీయులు నరికేశారు. రెడ్డప్పరెడ్డి, భరతకుమార్ సోదరుల తోటలో మూడేళ్ల వయసుగల 120 మామిడి మొక్కలను గురువారం అర్ధరాత్రి నరికేశారు. తామిద్దరం గురువారం రాత్రి తోటవద్దకు వెళ్లామని, ఆ సమయంలో తమ గ్రామానికి చెందిన వైసీపీ వర్గీయులు గోపాల్, శ్రీనివాసులు, రాఘవేంద్ర, శ్రావణ్‌కుమార్, నాగభూషణ్, వెంకటస్వామి కేకలు వేసుకుంటూ దాడికి ప్రయత్నించారని బాధితులు తెలిపారు. తాము ప్రాణభయంతో పరుగులు తీశామని, వారిని అడ్డుకున్న దళితుడు నరే్‌షపై దాడిచేశారని తెలిపారు. బాధితుల
ఫిర్యాదుమేరకు కేసు నమోదు చేశామని సీఐ రోషన తెలిపారు.
అటవిక చర్య: ఎమ్మెల్యే అశ్మితరెడ్డి
పండ్ల మొక్కలను నరకడం అటవిక చర్య అని ఎమ్మెల్యే జేసీ అశ్మితరెడ్డి అన్నారు. వీరన్నపల్లికి ఎమ్మెల్యే శుక్రవారం వెళ్లి బాధితులతో మాట్లాడారు. నరికివేసిన మొక్కలను పరిశీలించారు. దోషులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సీఐని ఆదేశించారు. అండగా ఉంటామని బాధిత రైతులకు భరోసా ఇచ్చారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....