CRICKET : ముగిసిన బధిరుల క్రికెట్ టోర్నీ
ABN , Publish Date - Nov 29 , 2024 | 12:43 AM
బధిరుల జాతీయ స్థాయి అండర్-19 క్రికెట్ టీ20 చాంపియన షిప్ పోటీల్లో ఒడిషా జట్టు విజేతగా నిలవగా, హర్యాణా ర న్నరప్‌గా నిలిచింది. స్థానిక ఆర్డీటీ స్టేడియంలో నిర్వహిస్తున్న బధిరుల నేషనల్ అండర్-19 క్రికెట్ టీ20 చాంఫియనషిప్ పోటీలు గురువారం ముగిశాయి. సెమీస్‌లో భాగంగా హర్యా ణా, ఆంధ్రప్రదేశ జట్ల మధ్య మొదటి మ్యాచ జరగగా... 15ఓవర్లలో ఆంధ్రప్రదేశ ఆరు వికెట్లు కోల్పోయి 93 పరుగులు చేసింది.
అనంతపురం క్లాక్‌టవర్, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): బధిరుల జాతీయ స్థాయి అండర్-19 క్రికెట్ టీ20 చాంపియన షిప్ పోటీల్లో ఒడిషా జట్టు విజేతగా నిలవగా, హర్యాణా ర న్నరప్‌గా నిలిచింది. స్థానిక ఆర్డీటీ స్టేడియంలో నిర్వహిస్తున్న బధిరుల నేషనల్ అండర్-19 క్రికెట్ టీ20 చాంఫియనషిప్ పోటీలు గురువారం ముగిశాయి. సెమీస్‌లో భాగంగా హర్యా ణా, ఆంధ్రప్రదేశ జట్ల మధ్య మొదటి మ్యాచ జరగగా... 15ఓవర్లలో ఆంధ్రప్రదేశ ఆరు వికెట్లు కోల్పోయి 93 పరుగులు చేసింది. అనంతరం బరి లోకి దిగిన హర్యాణా 14.4 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో హర్యాణా ఫైనల్‌కు చేరింది. రెండో సెమీస్ మ్యాచలో ఒడిషా, మహారాష్ట్ర జట్లు తలప డగా... ఒడిశా 15ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పో యి 129పరుగులు చేసింది. జితన నాయక్ 50పరుగులు చేశా డు. అనంతరం బరిలోకి దిగిన మహారాష్ట్ర 13.1ఓవర్లలో 70 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయ్యింది. ఫైనల్‌కు చేరి న హర్యాణా, ఒడిశా జట్లు మఽధ్య జరిగిన తుదిపోరులో ఒడి షా 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 138 పరుగులు చేసింది. బ్యాటర్ సనితశెట్టి 42 పరుగులు చేశాడు. అనంతరం బరిలోకి దిగిన హర్యాణా 17.4 ఓవర్లలో 96 పరుగులకు ఆలౌట్ అ య్యింది. 42 పరుగులతో గెలిచిన ఒడిషా ట్రోఫీ కౌవసం చేసు కుంది. దీంతో విజేతగా నిలిచిన ఒడిషా, రన్నర్‌గా నిలిచిన హర్యాణా జట్లకు బధిరుల క్రికెట్ అసోసియేషన జాతీయ అధ్యక్షుడు సుమితజైన చేతుల మీదుగా బహుమ తులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీటీ అనంత అకాడమీ మేనేజర్ శ్రీదేవి, జిల్లా మేనేజర్ దేవరాజ్, బధిరుల క్రికెట్ సంఘంరాష్ట్ర కార్యదర్శి నాగరాజు, ప్రధాన కార్యదర్శి సత్యనారాయణరెడ్డి, గోపినాథ్ తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....