CHILAKAM: రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు పెడుతోంది
ABN , Publish Date - Dec 22 , 2024 | 12:05 AM
రాష్ట్రంలో అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి పరుగులుతీస్తోందని, ఇది ఓర్వలేకే మాజీ సీఎం జగన, వైసీపీనాయకులు విమర్శలు చేస్తున్నారని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదనరెడ్డి అన్నారు.
ధర్మవరం, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి పరుగులుతీస్తోందని, ఇది ఓర్వలేకే మాజీ సీఎం జగన, వైసీపీనాయకులు విమర్శలు చేస్తున్నారని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదనరెడ్డి అన్నారు. శనివారం తన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవనకల్యాణ్ రాష్ట్రాభివృద్ధికి అహర్నిశలు కృషిచేస్తున్నారన్నారు. గత ప్రభుత్వంలో కక్షపూరితమైన పాలన చేసిందని, అందుకే ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారన్నారు. అయినా వారికి బుద్దిరాలేదన్నారు. గతంలో ఇళ్ల పట్టాలు పొంది ఇళ్లు నిర్మించుకోని లబ్ధిదారులకు కూటమి ప్రభుత్వం మంచి అవకాశం ఇచ్చిందన్నారు. ఇళ్లు నిర్మించుకుంటే గతంలో ఇచ్చే దానికంటే అదనంగా ఎస్సీలకు రూ.50వేలు, ఎస్టీలకు రూ.75వేలు ఇస్తుందన్నారు. చేనేత కార్మికులకు కూడా రూ.50వేలు ఇస్తుందన్నారు. అంతేకాకుండా 2013లో పట్టాలుపొంది ఇప్పటివరకు ఇళ్లు నిర్మించుకోని వారు కూడా తిరిగి దరఖాస్తు చేసుకోవచ్చాన్నారు. ఈ అవకాశాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
జనసేనలోకి 15 కుటుంబా లు చేరిక: బత్తలపల్లి మండలం తంబాపురం గ్రామం నుంచి 15 కుటుంబాలు జనసేన పార్టీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి చిలకం మధుసూదనరెడ్డి సమక్షంలో శనివారం పార్టీలోకి చేరారు. జనసేన మండల అధ్యక్షుడు పుర్రంశెట్టి రవి, రమణారెడ్డి ఆధ్వర్యంలో ధర్మవరంలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఆ కుటుంబ సభ్యులకు మధుసూదనరెడ్డి పార్టీ కండువాలు వేసి సాధారంగా ఆహ్వానించారు. ఏ సమస్య వచ్చినా మీకు అందుబాటులో ఉండి పరిష్కరిస్తానని పార్టీలోకి చేరినవారికి ఆయన భరోసా ఇచ్చారు.