MLA DAGGUPATI : ఓటేయలేదని పట్టించుకోలేదు..?
ABN , Publish Date - Nov 30 , 2024 | 12:15 AM
వైసీపీకి ఓటు వేయలేదన్న కార ణంతో 40వ డివిజనపై కక్షకట్టి గత నాలుగేళ్లల్లో ఒక్క పని కూడా చేయలేదని ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్ విమర్శించారు. మీ ఇంటికి - మీ ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా ఆయన శుక్రవారం మున్సిపల్ కమిషనర్ నాగరాజుతో కలిసి 40వ డివిజనలోని ఆజాద్ నగర్‌లో పర్యటిం చారు. ఇంటింటికీ తిరుగుతూ ప్రజల సమస్యలను తెలుసుకున్నారు.
వైసీపీ పాలనపై ఎమ్మెల్యే దగ్గుపాటి విమర్శ
అనంతపురం అర్బన, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి) : వైసీపీకి ఓటు వేయలేదన్న కార ణంతో 40వ డివిజనపై కక్షకట్టి గత నాలుగేళ్లల్లో ఒక్క పని కూడా చేయలేదని ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్ విమర్శించారు. మీ ఇంటికి - మీ ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా ఆయన శుక్రవారం మున్సిపల్ కమిషనర్ నాగరాజుతో కలిసి 40వ డివిజనలోని ఆజాద్ నగర్‌లో పర్యటిం చారు. ఇంటింటికీ తిరుగుతూ ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. డ్రైనేజీ, ఇళ్ల పట్టాలు, తాగునీటి సమస్యలను ప్రజలు ఆయన దృష్టి తీసుకొచ్చా రు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మా ట్లాడుతూ... గత నగరపాలిక ఎ న్నికల్లో స్వతంత్ర అభ్యర్థి శ్రీలక్ష్మిని గెలిపించడంతో గత పాలకులు ఈ డివిజన ప్రజల సమస్యలను పట్టించుకోలేదని విమర్శించారు. సీఎం చంద్రబాబు సహకారంతో ఇళ్ల పట్టాలతో పాటు ఇతర సమస్యలన్నింటినీ పరిష్కరిస్తా మ న్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు బుగ్గ య్య చౌదరి, తలారి ఆదినారాయణ, రాయల్ మురళి, మధు రాయల్, పోతుల లక్ష్మీనరసింహు లు, కడియాల కొండన్న, పీఎల్‌ఎన మూర్తి, పరమేశ్వరన, స్వప్న, సంగా తేజస్విని, సరళ, వడ్డే భవాని, సాలార్ బాషా, సరిపూటి రమణ, రాజారావు, రమేష్, నెట్టెం బాలకృష్ణ, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో తాగునీటి కష్టాలు
గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో నగర ప్రజలు తాగునీటి కష్టాలు ఎదుర్కొన్నారని ఎమ్మె ల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్ మండిపడ్డారు. కూడేరు మండలం ముద్దలా పురం వాటర్ ప్లాంట్ వద్ద 16 ఎంఎల్‌డీ ప్లాంట్ ట్రయల్ రనను ఆయన శుక్రవారం పరిశీలించారు. ప్లాంట్ నిర్మాణ పనులు, నీటి శుద్ధి తదితర అంశాలను పరిశీలించారు. నగర జనాభా పెరుగుతున్న నేపథ్యంలో సీఎం చంద్ర బాబు స్పందించి 2017లో రూ.16 కోట్లతో 16 ఎంఎల్‌డీ ప్లాంట్‌ను మంజూరు చేశారని గుర్తు చేశారు. గత ఐదేళ్లల్లో ఈ పనులు ముందుకు సా గలేదన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లోనే ప్లాంట్‌పనులు పూర్తి చేసిందన్నారు. ప్రస్తుతం 23 డివిజన్లకు ప్రతి రోజు తాగునీరు అందుతోందని, మరో 27 డివిజన్లకు రోజుమార్చి రోజు అందుతోం దన్నారు. ఇక నుంచి ప్రతి రోజు అన్ని డివిజనలకు తాగునీరు వస్తుంద న్నారు. అదనంగా ఏర్పాటు చేసిన ప్లాంట్ ద్వారా అనంత అర్బనతోపాటు నారాయణపురం పంచా యతీ ప్రజల దాహార్తి తీరుస్తామన్నారు. అన్ని సమస్యలను అధిగమించి నిరంతరాయంగా సాగు నీరు అందిస్తామన్నారు. నగర కమీషనర్ నాగరా జు, ఇంజనీరింగ్ అధికారులు నరసింహ, రాధాకృష్ణ, పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....