Share News

TDP : టీడీపీ సభ్యత్వ నమోదుకు విరాళాలు

ABN , Publish Date - Dec 10 , 2024 | 12:29 AM

అర్బన నియోజకవర్గంలో పేదల సభ్యత్వ నమోదు కోసం పలువురు విరాళాలు అందించారు. అనంత పురంలోని టీడీపీ అర్బన కార్యాలయంలో సోమవా రం మాజీ కార్పొరేటర్‌ బల్లా పల్లవి రూ. లక్ష, 9వ డివిజన నాయకుడు సాకే రామాంజినేయులు రూ. 50 వేలను ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్‌కు అందజేశారు. వారిని ఎమ్మెల్యే అభినందించారు.

TDP : టీడీపీ సభ్యత్వ నమోదుకు విరాళాలు
Former corporator Balla Pallavi giving donation to MLA

అనంతపురం అర్బన, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి) : అర్బన నియోజకవర్గంలో పేదల సభ్యత్వ నమోదు కోసం పలువురు విరాళాలు అందించారు. అనంత పురంలోని టీడీపీ అర్బన కార్యాలయంలో సోమవా రం మాజీ కార్పొరేటర్‌ బల్లా పల్లవి రూ. లక్ష, 9వ డివిజన నాయకుడు సాకే రామాంజినేయులు రూ. 50 వేలను ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్‌కు అందజేశారు. వారిని ఎమ్మెల్యే అభినందించారు. కొన్ని డివిజన్లల్లో ఇంకా సభ్యత్వ నమోదు తక్కువగా ఉందని, ఆయా ప్రాంతాల్లో నాయకులు ప్రత్యేక చొరవ చూపాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు గంగారామ్‌, సరిపూటి రమణ, కడియాల కొండన్న, నెట్టెం బాలకృష్ణ, నాగభూషణం, కృష్ణమోహననాయుడు, రాజప్ప, లక్ష్మీనారాయణరెడ్డి, కంఠాదేవి, మహేష్‌ తదితరులు పాల్గొన్నారు.

కష్టపడిన ప్రతి ఒక్కరికీ గుర్తింపు : ఎమ్మెల్యే

పార్టీ కోసం కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరికీ తగిన గుర్తింపు ఉంటుందని ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్‌ పేర్కొన్నారు. ఆయన సోమవారం స్థానిక హమాలీ కాలనీలోని తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి బంగి నాగ ఇంటికి వెళ్లారు. పలు అంశాలపై ఆయనతో చర్చిం చారు. గత ఐదేళ్లల్లో కీలకంగా పనిచేసిన నాయకులను విస్మరించే ప్రసక్తే లేదన్నారు. అదేవిధంగా టీడీపీ బెస్త సాధికార సమతి రాష్ట్ర కమిటీ సభ్యుడు చేపల హరి ఆధ్వర్యంలో సోమ వారం స్థానిక లక్ష్మీనగర్‌లోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన అయ్యప్పస్వామి పడి పూజకు ఎమ్మెల్యే హాజరై, పూజలు చేశారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Dec 10 , 2024 | 12:29 AM