MLA SUNITA : అధైర్యపడకండి..ఆదుకుంటాం..!
ABN , Publish Date - Oct 23 , 2024 | 12:20 AM
అధైర్యపడకండి..అన్ని విధాలా ఆదుకుంటామని వరద ప్రభావిత ప్రాంతాల వారికి ఎమ్మెల్యే పరిటాల సునీత భరోసా ఇచ్చారు. మండలపరిధిలోని ఉప్పరపల్లిలోని వదర ప్రభావిత ప్రాంతాల్లో జేసీ శివ్‌నారాయణ్‌శర్మతో కలసి ఆమె మంగళవారంలోని పర్యటించారు. స్థానికంగా జరుగుతున్న సహాయ చర్యలను పరిశీలించారు.
ఎమ్మెల్యే పరిటాల సునీత
అనంతపురంరూరల్, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): అధైర్యపడకండి..అన్ని విధాలా ఆదుకుంటామని వరద ప్రభావిత ప్రాంతాల వారికి ఎమ్మెల్యే పరిటాల సునీత భరోసా ఇచ్చారు. మండలపరిధిలోని ఉప్పరపల్లిలోని వదర ప్రభావిత ప్రాంతాల్లో జేసీ శివ్‌నారాయణ్‌శర్మతో కలసి ఆమె మంగళవారంలోని పర్యటించారు. స్థానికంగా జరుగుతున్న సహాయ చర్యలను పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ... అనుకోకుండా వచ్చిన వర్షాల కారణంగా భారీ నష్టం వాటిల్లిందని, పంటలు దెబ్బ తిన్న రైతులను ఆదుకునేందుకు ప్రయత్నం చేస్తామన్నారు. అధికారులంతా క్షేత్రస్థా యికి వెళ్లి నష్టాన్ని అంచనా వేయాలన్నారు. ఇప్పటికే మంత్రుల దృష్టికి జరిగిన నష్టాన్ని తీసుకెళ్లామని తెలిపారు. అధికారులు తెల్లవారుజామున నుంచి క్షేత్రస్థాయి లో ఉండి బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించారని, అక్కడ వారికి అవస రమైన ఆహారం అందుబాటులో ఉంచారన్నారు. ఇంత పెద్ద ఎత్తున జరిగిన నష్టం వెనుక గత ప్రభుత్వ నిర్లక్ష్యం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. ఈకార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ వేణుగోపాల్, మండల ప్రధాన కార్యదర్శి పామురాయి రఘు, టీడీపీ సీనియర్ నాయకులు శ్రీనివాసులురెడ్డి, గోవిందు, జగదీష్, బాలరాజు, ముత్యాలు, నరేష్ తదితరులు పాల్గొన్నారు. అలాగే టీడీపీ ధర్మవరం ఇనచార్జ్ పరిటాల శ్రీరామ్ వదర ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. స్థానిక నాయకులు, అధికా రులతో కలసి జగనన్న కాలనీని పరిశీలించారు. ఎస్పీ జగదీష్, ఇతర అ ధికారులతో విన్సెంట్ డీ పాల్ స్కూల్, ఆర్డీటీ స్టేడియం వద్ద బ్రిడ్జిపై పండమేరు ప్రవాహాన్ని పరిశీలించారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....