MLA : రైతులను ఇబ్బంది పెట్టకండి
ABN , Publish Date - Dec 23 , 2024 | 12:20 AM
మార్కెట్‌కు వచ్చే రైతులు, వ్యాపారులను ఇబ్బందులు పెట్ట వద్దని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్ర సాద్ సూచించారు. ఆయన ఆదివారం అనంతపురం వ్యవసాయ మార్కెట్ యార్డులో జరుగుతున్న పశువుల సంతను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ వ్యాపారులు, రైతులతో మాట్లాడారు. మార్కెట్‌లో సుంకం వసూలు, ఇతర సౌకర్యాల గురించి ఆరా తీశారు.
మార్కెట్‌లో భోజన వసతి కల్పిస్తాం : ఎమ్మెల్యే దగ్గుపాటి
అనంతపురం రూరల్, డిసెంబరు 22(ఆంధ్రజ్యోతి): మార్కెట్‌కు వచ్చే రైతులు, వ్యాపారులను ఇబ్బందులు పెట్ట వద్దని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్ర సాద్ సూచించారు. ఆయన ఆదివారం అనంతపురం వ్యవసాయ మార్కెట్ యార్డులో జరుగుతున్న పశువుల సంతను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ వ్యాపారులు, రైతులతో మాట్లాడారు. మార్కెట్‌లో సుంకం వసూలు, ఇతర సౌకర్యాల గురించి ఆరా తీశారు. మార్కెట్ ఫీజు వసూళ్లకు సం బంధించిన రసీదు బుక్కులను పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు, వ్యాపారులు మాట్లాడుతూ... గతంలో సంతలో భోజనం పెట్టేవారని ఇప్పు డు లేదని ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. భోజన వసతి కల్పించాలని కోరా రు. త్వరలోనే ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే వారికి తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... దూర ప్రాంతాల నుంచి ఇక్కడికి రైతులు, వ్యాపారులు వస్తుంటారని..వారిని ఇబ్బంది పెట్టవదన్నారు. మార్కెట్‌లో నిర్దేశించిన మేరకే సుంకం వసూలు చేయాలన్నారు. మార్కెట్‌లో మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర నాయకులు గంగారామ్, రాయల్ మురళి, ఫిరోజ్ అహ్మద్, టీడీపీ నాయకులు రమేష్, హరి తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....