JOINT COLLECTOR: రాగి పంట సాగుతో రైతుల ఆర్థికాభివృద్ధి
ABN , Publish Date - Dec 20 , 2024 | 12:06 AM
రబీ సీజనలో రైతులు బోరు బావుల కింద రాగిపంట సాగు చేయడం ద్వారా ఆర్థికంగా అభివృద్ధి చెందవచ్చని జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ అన్నారు. గురువారం మండలంలోని మోరుబాగల్ గ్రామంలో రాగి పంట సాగుపై రైతులతో సమావేశం నిర్వహించారు.
గుడిబండ, డిసెంబరు 19(ఆంధ్రజ్యోతి): రబీ సీజనలో రైతులు బోరు బావుల కింద రాగిపంట సాగు చేయడం ద్వారా ఆర్థికంగా అభివృద్ధి చెందవచ్చని జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ అన్నారు. గురువారం మండలంలోని మోరుబాగల్ గ్రామంలో రాగి పంట సాగుపై రైతులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ రైతులు బోరుబావుల కింద విరివిగా రాగి పంట సాగు చేయాలన్నారు. పండించిన రాగులను ప్రభుత్వం క్వింటాల్ రూ.4290తో కొనుగోలు చేస్తుందన్నారు. కొనుగోలు చేసిన రాగులను ప్రభుత్వం చౌకధాన్యపు డిపోల ద్వారా కార్డుదారులకు అందిస్తామన్నారు. రైతులు ప్రత్యేక దృష్టి సారించి రబీలో రాగి పంట సాగుచేసి అధిక దిగుబడులు సాధించి వాటిని విక్రయించి ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నారు. అనంతరం రాగి పంటసాగుపై రైతులకు అవగాహన కల్పించారు. జిల్లా వ్యవసాయ అధికారి సుబ్బారావు మడకశిర ఏడీఏ కృష్ణమోహన, తహసీల్దార్ కరుణాకర్, వ్యవసాయ అధికారి వీరనరేష్, వివిధ శాఖల అధికారులు, నాయకులు పురుషోత్తం, మాజీ ఎంపీటీసీ రాజన్న పాల్గొన్నారు.