Share News

PARITALA SUNITA : అహుడా నిబంధనలను అమలు చేయండి

ABN , Publish Date - Aug 07 , 2024 | 12:21 AM

అహుడా పరిధిలో ఇళ్ల స్థలాల లే అవుట్లు, ఇతర విషయాల్లో నిబంధనలు కచ్చితంగా పాటించేలా చూడాలని ఎమ్మెల్యే పరిటాల సునీత అధికారులను ఆదేశించారు. నగరంలోని తన క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఆమె అహుడా అధికారులతో సమావేశం నిర్వహించారు. రియల్టర్లు నిబంధనలను పాటిస్తున్నారా అని ప్రశ్నించారు. ప్రజలు ప్లాట్లు కొనుగోలు చేయకముందే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. లేదంటే ప్రజలు నష్టపోతారని అన్నారు. రాప్తాడు పరిధిలో పెండింగ్‌ ఫైల్స్‌ని వెంటనే క్లియర్‌ ...

PARITALA SUNITA : అహుడా నిబంధనలను అమలు చేయండి
MLA Paritala Sunitha speaking in the meeting

అధికారులకు ఎమ్మెల్యే పరిటాల సునీత ఆదేశం

అనంతపురం రూరల్‌, ఆగస్టు 6: అహుడా పరిధిలో ఇళ్ల స్థలాల లే అవుట్లు, ఇతర విషయాల్లో నిబంధనలు కచ్చితంగా పాటించేలా చూడాలని ఎమ్మెల్యే పరిటాల సునీత అధికారులను ఆదేశించారు. నగరంలోని తన క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఆమె అహుడా అధికారులతో సమావేశం నిర్వహించారు. రియల్టర్లు నిబంధనలను పాటిస్తున్నారా అని ప్రశ్నించారు. ప్రజలు ప్లాట్లు కొనుగోలు చేయకముందే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. లేదంటే ప్రజలు నష్టపోతారని అన్నారు. రాప్తాడు పరిధిలో పెండింగ్‌ ఫైల్స్‌ని వెంటనే క్లియర్‌ చేయాలని ఆదేశించారు. పాపంపేటలో ప్రధాన సమస్యగా మారిన 30 అడుగల రోడ్డు గురించి సుదీర్ఘంగా చర్చించారు. కళ్యాణదుర్గం రోడ్డు నుంచి బళ్లారి రోడ్డుకు వెళ్లే మార్గంలో ప్రస్తుతం 30 అడుగల రోడ్డు ఉంది. దీనిని 60 అడుగల రోడ్డుగా


మార్చేందుకు అహుడా అధికారులు చర్యలు చేపట్టారు. కానీ స్థానికులు మాత్రం 30 అడుగల రోడ్డు సరిపోతుందని, ఎలాంటి సమస్య లేదని ఎమ్మెల్యే దృష్టి తెచ్చారు. ఇక్కడున్నదంతా నిరుపేదలేని ఎమ్మెల్యేకి ఇటీవల వివరించారు. ఈ నేపథ్యంలో అధికారులతో రోడ్డు విస్తరణ గురించి ఎమ్మెల్యే చర్చించారు. గతంలో మాస్టర్‌ ప్లాన ప్రకారం అది బండి జాడ రోడ్డు అని, 12 అడుగుల రోడ్డు మాత్రమే ఉండేదని, ఆ తరువాత 30 అడుగుల రోడ్డుగా మారిందని, ప్రజలకు ఇబ్బంది లేనప్పుడు విస్తరణ ఎందుకని ప్రశ్నించారు. అహుడా అధికారులు మాత్రం కనీసం 40 అడుగులైనా రోడ్డు ఉండాలని ప్రతిపాదించగా, అన్ని అంశాలు మరోసారి పరిశీలించి, ప్రజలకు ఇబ్బంది లేకుండా నిర్ణయం తీసుకుందామని ఎమ్మెల్యే అన్నారు. అహుడా అధికారులు, మాజీ జడ్పీటీసీ వేణుగోపాల్‌, మాజీ మండల కన్వీనర్‌ చల్లా జయకృష్ణ స్థానిక టీడీపీ నాయకులు, డీలర్లు రామాంజినేయులు, బాబావలి పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Aug 07 , 2024 | 12:21 AM