MP AMBIKA: నైపుణ్యాభివృద్ధి సంస్థలను ఏర్పాటు చేయండి
ABN , Publish Date - Dec 02 , 2024 | 11:47 PM
జిల్లాలో నైపుణ్యాభివృద్ధి సంస్థలను ఏర్పాటు చేయాలని కేంద్ర నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి జయంత చౌదరిని ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ కోరారు.
అనంతపురం, డిసెంబరు 2(ఆంధ్రజ్యోతి): జిల్లాలో నైపుణ్యాభివృద్ధి సంస్థలను ఏర్పాటు చేయాలని కేంద్ర నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి జయంత చౌదరిని ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ కోరారు. ఆయన సోమవారం కేంద్రమంత్రిని ఢిల్లీలోని ఆయన కార్యాలయంలో కలిశారు. కరువు జిల్లాలో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు నైపుణ్యాభివృద్ధి సంస్థలను ఏర్పాటు చేయాలని కోరారు. ముఖ్యంగా జిల్లాలో సూర్యరశ్మిని ఉపయోగించుకొని, ఇంధన పర్యావరణ వ్యవస్థ ద్వారా విద్యుతను ఉత్పత్తి చేసే నైపుణ్య శిక్షణ సంస్థలు ఏర్పాటు చేయాలని కోరారు. ఇందుకు కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించినట్లు ఎంపీ తెలిపారు. లోక్‌సభలో కూడా ఇదే అంశంపై ఎంపీ అంబికా మాట్లాడారు.