Share News

MLA : శివారు కాలనీలపై ఐదేళ్ల నిర్లక్ష్యం

ABN , Publish Date - Dec 25 , 2024 | 12:52 AM

గత ఐదేళ్ల వైసీపీ పాలనలో నగర శివారు కాలనీలపై తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించారని ఎమ్మెల్యే దగ్గుపాటి వెంక టేశ్వర ప్రసాద్‌ పేర్కొన్నారు. మీ ఇంటికీ - మీ ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా మంగళవారం 22వ డివిజన పరిధిలోని మరువకొ మ్మ కాలనీలో టీడీపీ నాయకులు, అధికారులతో కలిసి ఎమ్మెల్యే పర్యటించా రు.

MLA : శివారు కాలనీలపై ఐదేళ్ల నిర్లక్ష్యం
MLA inquiring about drainage problem in Maruvakomma Colony

ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌

అనంతపురం అర్బన, డిసెంబరు 24 (ఆంధ్రజ్యోతి) : గత ఐదేళ్ల వైసీపీ పాలనలో నగర శివారు కాలనీలపై తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించారని ఎమ్మెల్యే దగ్గుపాటి వెంక టేశ్వర ప్రసాద్‌ పేర్కొన్నారు. మీ ఇంటికీ - మీ ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా మంగళవారం 22వ డివిజన పరిధిలోని మరువకొ మ్మ కాలనీలో టీడీపీ నాయకులు, అధికారులతో కలిసి ఎమ్మెల్యే పర్యటించా రు. ఇంటింటికి వెళ్లి సమస్యలపై ఆరా తీశారు. డ్రైనేజీ, తాగునీరు, ఇళ్ల పట్టాల సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి ప్రజలు తీసుకొచ్చా రు. కాలనీలో డ్రైనేజీలు ఇంత అధ్వానంగా ఉండేందుకు కారణమేంటని నగర పాలక సంస్థ అధికారులను ఎమ్మె ల్యే నిలదీశారు. వెంటనే డ్రైనేజీ కాలువలు శు భ్రం చే యించాలని ఆదేశించారు. కాలనీలో ఎకరా స్థలంలో పార్కు, స్కూల్‌ ఏర్పాటు చేయాలని, 30 ఏళ్లుగా కాలనీ లో ఇళ్ల పట్టాల సమస్య ఉందని స్థానికులు తెలిపారు. కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లి త్వరలోనే ఇళ్ల పట్టాలు మం జూరు చేసేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కాలనీలో పార్కు, స్కూల్‌ ఏర్పాటుపై మంత్రి నారా లోకేశ దృష్టికి తీసుకెళ్తామన్నారు. నగరంలోని సమస్యల ను ప్రాధాన్యతల వారీగా పరిష్కరిస్తామని పేర్కొన్నారు. ఎమ్మెల్యే ఆదేశాలతో కాలనీలోని డ్రైనేజీ కాలువలను కార్మికులు శుభ్రం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు జైబున్నీ, మంజుల, ఈశ్వరయ్య, రాయల్‌ మురళీ, గుర్రం నాగభూషణం, పరమేశ్వరన, సంగా తేజస్విని, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Dec 25 , 2024 | 12:53 AM