Share News

Tdp : కుర్చీ కోసం..

ABN , Publish Date - Aug 19 , 2024 | 12:07 AM

అధికార తెలుగుదేశం పార్టీ గుంతకల్లు మునిసిపాలిటీని చేజిక్కించుకునేందుకు కసరత్తు ప్రారంభించింది. వైసీపీ కౌన్సిలర్లు టీడీపీ వైపు ఆకర్షితుతున్నా.. ఇన్నాళ్లూ పెద్దగా ఆసక్తి చూపలేదు. మునిసిపాలిటీలో అనుకూల నిర్ణయాలు తీసుకోవడానికి కౌన్సిల్‌లో మెజారిటీ లేకపోవడంతో భవిష్యత్తులో ఇబ్బందులు లేకుండా ఉండటం కోసం ప్రస్తుత పాలకవర్గానికి నాలుగేళ్లు పూర్తయ్యాక చైర్మన పదవిని చేజిక్కించుకునేందుకు వీలుగా వైసీపీ కౌన్సిలర్లను పార్టీలో చేర్చుకోవాలని టీడీపీ శిబిరం యోచిస్తోంది. మాసాంతపు మునిసిపల్‌...

Tdp : కుర్చీ కోసం..
Guntakallu Municipal Office

మునిసిపాలిటీపై టీడీపీ గురి

తొమ్మిది మంది వైసీపీ కౌన్సిలర్లకు గాలం

తెలుగుదేశంలో చేరికకు రంగం సిద్ధం

నేడే ముహూర్తం?

అధికార తెలుగుదేశం పార్టీ గుంతకల్లు మునిసిపాలిటీని చేజిక్కించుకునేందుకు కసరత్తు ప్రారంభించింది. వైసీపీ కౌన్సిలర్లు టీడీపీ వైపు ఆకర్షితుతున్నా.. ఇన్నాళ్లూ పెద్దగా ఆసక్తి చూపలేదు. మునిసిపాలిటీలో అనుకూల నిర్ణయాలు తీసుకోవడానికి కౌన్సిల్‌లో మెజారిటీ లేకపోవడంతో భవిష్యత్తులో ఇబ్బందులు లేకుండా ఉండటం కోసం ప్రస్తుత పాలకవర్గానికి నాలుగేళ్లు పూర్తయ్యాక చైర్మన పదవిని చేజిక్కించుకునేందుకు వీలుగా వైసీపీ కౌన్సిలర్లను పార్టీలో చేర్చుకోవాలని టీడీపీ శిబిరం యోచిస్తోంది. మాసాంతపు మునిసిపల్‌ సమావేశంలో స్టాండింగ్‌ కౌన్సిల్‌ పదవీ నియామకం చేపట్టనున్నందున అంతలోపు కౌన్సిల్‌లో మెజారిటీని సాధించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఈ


కారణంగా వైసీపీ కౌన్సిలర్లను తమ శిబిరంలో కలుపుకునేందుకు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. - గుంతకల్లు

టీడీపీలోకి తొమ్మిది మంది

సార్వత్రిక ఎన్నికలకు ముందే వైసీపీ నుంచి నలుగురు కౌన్సిలర్లు టీడీపీలోకి చేరారు. ఎన్నికలు పూర్తయి టీడీపీ భారీ విజయాన్ని సాధించడంతో వైసీపీ కౌన్సిలర్లు ఆ పార్టీలో ఉంటే వార్డుల అభివృద్ధి నిలిచిపోతుందేమోనన్న అనుమానంతో అధికారపార్టీలో చేరడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. ఎన్నికల ఫలితాల తర్వాత ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాంను కలిసిన వైసీపీ కౌన్సిలర్లు ఆయనకు సన్మానాలు చేశారు. ఈక్రమంలోనే పార్టీలోకి చేరే విషయం చర్చించారు. టీడీపీలో వ్యతిరేకత రావడంతో వారిని పార్టీలోకి చేర్చుకునే విషయంలో వేచిచూసే ధోరణిని కనబరిచారు. మునిసిపాలిటీ సమావేశాల్లో సానుకూల నిర్ణయాలు తీసుకోవడానికి కౌన్సిల్‌లో తగినంత బలం లేకపోవ డం అధికార పార్టీకి సమస్యగా మారింది. దీంతో కౌన్సిల్‌లో తగినంత బలాన్ని పెంచుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. వైసీపీకి చెందిన తొమ్మిది మంది కౌన్సిలర్లను టీడీపీలో చేర్చుకునేందుకు రంగం సిద్ధం చేశారు. టీడీపీకి ఏడుగురు కౌన్సిలర్లు ఉండగా, ఎన్నికల సమయంలో నలుగురు వైసీపీ కౌన్సిలర్లు టీడీపీలోకి చేరడంతో సంఖ్యా బలం 11కు పెరిగింది. ప్రస్తుతం తొమ్మిది మంది కౌన్సిలర్లు టీడీపీలో చేరడానికి ఆసక్తి చూపుతున్నారు. వారు కూడా చేరితే కౌన్సిల్‌లో టీడీపీ బలం 20కి పెరగనుంది. స్థానిక ఎమ్మెల్యే గుంతకల్లులోనే ఎక్స్‌-అఫిషియో సభ్యత్వాన్ని కలిగి ఉండటంతో సంఖ్యా బలం 21కి పెరుగు తుంది. వచ్చే ఫిబ్రవరి కల్లా మూడింట రెండొంతుల బలాన్ని కూడగట్టుకుని చైర్‌పర్సనపై అవిశ్వాసం పెట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

స్టాండింగ్‌ కౌన్సిల్‌ చుట్టూ రాజకీయం

మునిసిపాలిటీకి న్యాయ సలహాలు ఇచ్చే స్టాండింగ్‌ కౌన్సిల్‌ పదవి చుట్టూ ప్రస్తుతం రాజకీయం నడుస్తోంది. వైసీపీ పాలనలో స్టాండింగ్‌ కౌన్సిల్‌ పదవిలో న్యాయవాది తిమ్మారెడ్డి నియమితులయ్యారు. ప్రభుత్వం మారడంతో ఆయన తన పదవికి రాజీనామా చేశారు. దీంతో ప్రస్తుతం స్టాండింగ్‌ కౌన్సిల్‌ పదవిని భర్తీ చేసే విషయంగా మునిసిపాలిటీ దరఖాస్తులను ఆహ్వానించింది. ఎమ్మెల్యే జయరాం సిఫారసుతో టీడీపీ నాయకుడైన న్యాయవాది బీఎస్‌ కృష్ణారెడ్డి దరఖాస్తు చేశారు. ఆయనకు పోటీగా గోపాల కృష్ణ అనే న్యాయవాదిని వైసీపీ రంగంలోకి దింపింది. వీరిద్దరూ కాకుండా మరో ముగ్గురు దరఖాస్తు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో కౌన్సిల్‌లో టీడీపీకి సంఖ్యా బలం అవసరం ఏర్పడింది. దీంతో వైసీపీ కౌన్సిలర్లను పార్టీలోకి తీసుకోవడానికి టీడీపీ గేట్లను తెరచింది. ఈ విషయం తెలిసిన మాజీ ఎమ్మెల్యే వెంకటరామిరెడ్డి వైసీపీ కౌన్సిలర్లను పిలిపించి పార్టీ వీడవద్దంటూ అనునయించినట్లు సమాచారం. వైసీపీ కౌన్సిలర్లు సోమవారం టీడీపీలో చేరనున్నట్లు తెలిసింది. ఇదే జరిగితే కౌన్సిల్‌లో వైసీపీ బలహీన పడనుంది.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Aug 19 , 2024 | 12:07 AM