Share News

MLA DAGGUPATI: రక్షణ గోడల ఏర్పాటుకు నిధులివ్వండి

ABN , Publish Date - Aug 28 , 2024 | 11:31 PM

అనంతపురం నగరంలో నడిమి, మరువ వంకలకు రక్షణ గోడల ఏర్పాటు కోసం నిధులు మంజూరు చేయాలని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడును ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్‌ కోరారు. విజయవాడలోని మంత్రి క్యాంప్‌ కార్యాలయంలో బుధవారం మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్‌ రాజుతో కలిసి దగ్గుపాటి మంత్రికి వినతి పత్రం అందజేశారు.

MLA DAGGUPATI: రక్షణ గోడల ఏర్పాటుకు నిధులివ్వండి
MLA presenting petition to Minister Ramanaidu

అనంతపురం అర్బన, ఆగస్టు 28: అనంతపురం నగరంలో నడిమి, మరువ వంకలకు రక్షణ గోడల ఏర్పాటు కోసం నిధులు మంజూరు చేయాలని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడును ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్‌ కోరారు. విజయవాడలోని మంత్రి క్యాంప్‌ కార్యాలయంలో బుధవారం మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్‌ రాజుతో కలిసి దగ్గుపాటి మంత్రికి వినతి పత్రం అందజేశారు. అనంతపురం నగరంతోపాటు రాప్తాడు నియోజకవర్గంలో భారీ వర్షాలు పడిన సమయంలో నడిమి, మరువ వంకలకు పెద్ద ఎత్తున నీరు వస్తోందని మంత్రికి వివరించారు. తద్వారా వంకల్లోని నీరు పరిసర ప్రాంతాల్లోని కాలనీల్లోకి వెళ్లడంతో ఇళ్లు నీటమునుగుతున్నాయన్నారు. దీంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఇప్పటికే ఇలాంటి పరిస్థితి ఇటీవల రెండు సార్లు జరిగాయన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని రెండు కాలువల వెంబడి ఇరువైపులా రక్షణ గోడల నిర్మాణం కోసం రూ.124.02 కోట్లు అవసరం అవుతుందన్నారు. ఈ మొత్తాన్ని మంజూరు చేయాలని మంత్రిని కోరారు. ఇందుకు మంత్రి సానుకూలంగా స్పందించారు. ప్రొటెక్షన వాల్స్‌ నిర్మాణానికి నిధులు మంజూరయ్యేలా చూస్తామని హామీ ఇచ్చారు.

మంత్రి సవితతో ఎమ్మెల్యే భేటీ: బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితతో ఎమ్మెల్యేలు దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్‌, ఎంఎస్‌ రాజు భేటీ అయ్యారు. బుధవారం అమరావతిలో ఏపీ సచివాలయం నాలుగో బ్లాక్‌లో మంత్రి పేషీలో ఆమెను ఎమ్మెల్యేలు కలిసి పలు అంశాలపై చర్చించారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు నియోకవర్గాల్లో పలు ప్రభుత్వ కార్యక్రమాల అమలుపై మంత్రి దిశానిర్దేశం చేశారు.

Updated Date - Aug 28 , 2024 | 11:31 PM