CPI RAMAKRISHNA: హంద్రీనీవాకు నిధులు కేటాయించాలి
ABN , Publish Date - Oct 30 , 2024 | 11:46 PM
హంద్రీనీవా కాలువకు బడ్జెట్‌లో అధికంగా నిధులు కేటాయించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డి మాండ్ చేశారు. బుధవారం సీపీఐ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ కరువు జిల్లాకు నీరు అందించే హంద్రీనీవా విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు.
అనంతపురం విద్య, అక్టోబరు 30(ఆంధ్రజ్యోతి): హంద్రీనీవా కాలువకు బడ్జెట్‌లో అధికంగా నిధులు కేటాయించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డి మాండ్ చేశారు. బుధవారం సీపీఐ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ కరువు జిల్లాకు నీరు అందించే హంద్రీనీవా విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. కాలవ సామర్థ్యాన్ని పెంచాలని కోరారు. బడ్జెట్‌లో హంద్రీనీవాకు రూ.2 వేల కోట్లు, వెలిగొండకు రూ. 2 వేల కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. రాషా్ట్ర్ట్రనికి ప్రయోజనం కలిగించే పోలవరం ఎత్తు కుదించేందుకు, ప్యాకేజీ డబ్బులు ఎగ్గొట్టేందుకు కేంద్రప్రభుత్వం యత్నిస్తోందని విమర్శించారు. పోలవరంతో తాగు, సాగునీటితో పాటు 960 మెగావాట్ల విద్యుత ఉత్పత్తి సామర్థ్యాం ఉందన్నారు. గతంలో వైఎస్ జగన ప్రభుత్వం ఉన్నప్పుడు సైతం కేంద్రం ఇదేవిధంగా దోబూచులాడిందని మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో లాలూచీ పడితే... నూకలు చెల్లినట్టే అన్నారు. నిర్వాసితులకు న్యాయం జరిగేలా చూడాలన్నారు. ఈ విషయంలో ఏపీ రాష్ట్ర ప్రయోజనాల కోసం అన్ని పార్టీలు కలసి రావాలని ఆయన కోరారు. సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జగదీష్, అనంతపురం, సత్యసాయి జిల్లాల కార్యదర్శులు జాఫర్, వేమయ్య, నాయకులు నారాయణస్వామి, శ్రీరాములు, అల్లిపీరా, రమణ పాల్గొన్నారు.
గుత్తికోటను అభివృద్ధి చేయండి: గుత్తి కోటను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ముఖ్యమంత్రికి లేఖ రాశారు. బుధవారం ఆయన నిర్వహించిన మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు పంపిన లేఖను విడుదల చేశారు. తర్వాత ఆయన మాట్లాడుతూ...1500 ఏళ్ల కిందట బాదామి చాళుక్యులు నిర్మించిన గుత్తి కోటను విజయనగర రాజు లు మరింత పటిష్టం చేశారని గుర్తుచేశారు. జిల్లాలో ఎక్కడా ఇలాంటి కోట లేదన్నారు. ఇతర జిల్లాల నుంచి ఈ కోటను చూసేందుకు పర్యాటకులు వస్తుంటారని పేర్కొన్నారు.