MLA SUNITA: వీలైనన్ని చెరువులకు నీరివ్వాలి
ABN , Publish Date - Sep 20 , 2024 | 12:10 AM
రా ప్తాడు నియోజకవర్గానికి హెచఎల్సీ, హంద్రీనీవా నుంచి వీలైనంత మేరకు సాగు, తాగు నీరందించాలని జిల్లా కలెక్టర్, ఐఏబీ చైర్మన వినోద్‌కుమార్‌కు ఎమ్మెల్యే పరిటాల సునీత విజ్ఞప్తి చేశారు. కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవనలో గురు వారం నిర్వహించిన ఐఏబీ సమావేశానికి అనివార్య కారణాల తో హాజరుకాలేకపోయానంటూ ఆమె ఐఏబీ చైర్మనకు లేఖ ద్వారా తెలుపుతూ, నియోజకవర్గంలో నెలకొన్న తాగు,సాగు నీటి సమస్యలను విన్నవించారు. పీఏబీఆర్, హంద్రీనీవా ద్వా రా రాప్తాడు నియోజకవర్గానికి తాగు, సాగు నీరు అందుతోం దని పేర్కొన్నారు.
ఐఏబీ చైర్మన, కలెక్టర్‌కు
ఎమ్మెల్యే పరిటాల సునీత విజ్ఞప్తి
అనంతపురం, సెప్టెంబరు 19(ఆంధ్రజ్యోతి): రా ప్తాడు నియోజకవర్గానికి హెచఎల్సీ, హంద్రీనీవా నుంచి వీలైనంత మేరకు సాగు, తాగు నీరందించాలని జిల్లా కలెక్టర్, ఐఏబీ చైర్మన వినోద్‌కుమార్‌కు ఎమ్మెల్యే పరిటాల సునీత విజ్ఞప్తి చేశారు. కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవనలో గురు వారం నిర్వహించిన ఐఏబీ సమావేశానికి అనివార్య కారణాల తో హాజరుకాలేకపోయానంటూ ఆమె ఐఏబీ చైర్మనకు లేఖ ద్వారా తెలుపుతూ, నియోజకవర్గంలో నెలకొన్న తాగు,సాగు నీటి సమస్యలను విన్నవించారు. పీఏబీఆర్, హంద్రీనీవా ద్వా రా రాప్తాడు నియోజకవర్గానికి తాగు, సాగు నీరు అందుతోం దని పేర్కొన్నారు. అయితే పీఏబీఆర్ కుడి కాలువ నుంచి గత కొన్నేళ్లుగా తమ నియోజకవర్గానికి రావాల్సిన నీరు రావడం లేదన్నారు. తద్వారా చాలా మంది రైతులు నష్టపోతున్నారన్నారు.
ఈ సారైనా కేటా యింపులు చేసిన విధంగా నీరు విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని ఆ మె ఆ లేఖలో కలెక్టర్‌ను కోరారు. పీఏబీఆర్ నుంచి సత్యసాయి తాగునీటి ప థకం కింద నియోజ కవర్గంలోని చాలా గ్రామాలకు నీరు సరిగా అందడం లేదన్నారు. ఈ పథకాల నిర్వహణలో లోపాలు, కార్మికులు తరచూ సమ్మెల కు వెళ్లడం వల్ల నీటి సరఫరా ఆగిపోతోందన్నారు. దీంతో తాగునీటి కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొ న్నారు. కార్మికులు నిరంతరం విధుల్లో ఉండేలా వారి సమ స్యలు తీర్చాలని కోరారు. రాప్తాడు నియోజకవర్గానికి పీఏబీ ఆర్ నుంచి ప్రతి ఏటా ఇచ్చే నీటా వాటాతో పాటు అవస రం మేరకు అదనంగా నీరివ్వాలని ఆమె విజ్ఞప్తి చేశారు. హంద్రీనీవా ద్వారా గత ఐదేళ్లుగా నీరందక చెరువులు నిండకపోవడంతో రైతులు ఇబ్బంది పడ్డారన్నారు. ఈ సారైనా రాప్తాడు నియోజకవర్గంలో వీలైనన్ని చెరువులను నీటితో నింపాలని ఆమె కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు. కాలువల నిర్వహణపై అధికారులు పరిశీలించేలా ఆదేశాలు జారీ చేయాలని ఎమ్మెల్యే పరిటాల సునీత ఐఏబీ చైర్మన, కలెక్టర్ వినోద్‌కుమార్‌కు విన్నవించారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....