Share News

MLA : క్రిస్టియన్లకు అండగా ప్రభుత్వం

ABN , Publish Date - Dec 18 , 2024 | 11:58 PM

క్రిస్టియన్లకు కూ టమి ప్రభుత్వం అండగా ఉందని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌ అన్నారు. మండలంలోని రాచానపల్లిలోని యేసు కృపా మందిరంలో బుధవారం జిల్లా పాస్టర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన అధ్యక్షుడు నాగరాజు ఆధ్వర్యంలో ప్రీ క్రిస్మస్‌ వేడుకలు నిర్వహించారు. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌ ముఖ్యఅతిథి గా హాజరయ్యారు.

MLA : క్రిస్టియన్లకు అండగా ప్రభుత్వం
MLA and association members cutting cake in pre-Christmas celebrations

త్వరలో పాస్టర్లకు పెండింగ్‌ వేతనాల విడుదల

ప్రీ క్రిస్మస్‌ వేడుకల్లో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌

అనంతపురం రూరల్‌, డిసెంబరు 18(ఆంధ్రజ్యోతి): క్రిస్టియన్లకు కూ టమి ప్రభుత్వం అండగా ఉందని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌ అన్నారు. మండలంలోని రాచానపల్లిలోని యేసు కృపా మందిరంలో బుధవారం జిల్లా పాస్టర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన అధ్యక్షుడు నాగరాజు ఆధ్వర్యంలో ప్రీ క్రిస్మస్‌ వేడుకలు నిర్వహించారు. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌ ముఖ్యఅతిథి గా హాజరయ్యారు. పాస్టర్లతో కలసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కేక్‌కట్‌ చేసి క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... క్రిస్టియన్లకు ఏసాయం కావాలన్నా ముందుంటానన్నారు. పాస్టర్లకు పెండింగ్‌లో ఉన్న వేతనాలపై సీఎం చంద్రబాబు ఒక నిర్ణయం తీసుకున్నారని, త్వరలోనే విడుదల చేసే అవకాశం ఉందన్నారు. అసోసి యేషనలో ఉన్న పాస్టర్లు, సభ్యులు, పేద క్రిస్టియన్లకు క్రిస్మస్‌ కానుకగా ఉచితంగా నిత్యవసర సరుకులు, వసా్త్రలు, నగదును ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు. ఈకార్యక్రమంలో హైదరాబాదు ఎవెంజెలిస్ట్‌ పాస్టర్‌ గాడ్లి, అసోసియేషన వైస్‌ ప్రెసిడెంట్‌ మార్కు, సహాయకార్యదర్శి మనషే, ఆనంద్‌, కోశాధికారి జావనబాబు, రూఫస్‌, శాంతవర్ధన, జహంగీర్‌ జాషువా,లాబాన టీడీపీ, వైసీపీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

పడి పూజకు హాజరైన ఎమ్మెల్యే

అనంతపురం అర్బన, డిసెంబరు 18 (ఆంధ్రజ్యోతి) : అర్బన పరిధిలోని అంబేడ్కర్‌ నగర్‌లో బుధవారం అయ్యప్ప స్వామి భక్త మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన పడి పూజ కార్యక్రమానికి ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్‌ హాజరయ్యారు. ముందుగా అయ్యప్ప మాలధారులతో కలిసి భజన కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం స్వామికి ఎమ్మెల్యే హారతినిచ్చారు. మాలధారులకు అన్న ప్రసాదం అందజేశారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Dec 18 , 2024 | 11:58 PM