Share News

Liquour shops : మందు జాగ్రత్త..!

ABN , Publish Date - Jun 04 , 2024 | 12:30 AM

కౌంటింగ్‌ నేపథ్యంలో ప్రభుత్వ మద్యం దుకాణాలు, బార్‌ అండ్‌ రెస్టారెంట్లను సోమవారం బంద్‌ చేశారు. ఎక్సైజ్‌ అధికారులు, సిబ్బంది షాపులకు సీల్‌ వేశారు. తాడిపత్రి నియోజకవర్గంలో సోమవారం ఉదయం నుంచి, మిగతా నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటల నుంచి బంద్‌ చేయించారు. పోలింగ్‌ రోజు అల్లర్లను దృష్టిలో ఉంచుకొని తాడిపత్రి నియోజకవర్గంలో ఈ నెల 5వతేదీ దాకా మద్యం షాపులను మూసివేయాలని నిర్ణయించారు. మిగతా నియోజకవర్గాల్లో ఈనెల 4వతేదీ దాకా మూసేస్తారు. దీంతో మద్యం ప్రియులు ‘మందు’ జాగ్రత్తలు తీసుకున్నారు. మద్యం...

Liquour shops : మందు జాగ్రత్త..!
Drug addicts who queued up at the liquor shop near the Collectorate

కౌంటింగ్‌ నేపథ్యంలో ప్రభుత్వ మద్యం దుకాణాలు, బార్‌ అండ్‌ రెస్టారెంట్లను సోమవారం బంద్‌ చేశారు. ఎక్సైజ్‌ అధికారులు, సిబ్బంది షాపులకు సీల్‌ వేశారు. తాడిపత్రి నియోజకవర్గంలో సోమవారం ఉదయం నుంచి, మిగతా నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటల నుంచి బంద్‌ చేయించారు. పోలింగ్‌ రోజు అల్లర్లను దృష్టిలో ఉంచుకొని తాడిపత్రి నియోజకవర్గంలో ఈ నెల 5వతేదీ దాకా మద్యం షాపులను మూసివేయాలని నిర్ణయించారు. మిగతా నియోజకవర్గాల్లో ఈనెల 4వతేదీ దాకా మూసేస్తారు. దీంతో మద్యం ప్రియులు ‘మందు’ జాగ్రత్తలు తీసుకున్నారు. మద్యం


దుకాణాలకు క్యూ కట్టి కొనుగోలు చేశారు. ఫోన పే ద్వారా మాత్రమే అమ్మకాలు సాగించారు. నగదుకు మద్యం ఇచ్చేది లేదనడంతో పలువురు నిట్టూరుస్తూ వెనుదిరిగారు. ఎన్నికల నేపథ్యంలో రోజువారి టార్గెట్‌ పూర్తి కావడంతో కొన్ని ప్రాంతాల్లో మధ్యాహ్నం 12 గంటలకే మద్యం షాపులు మూసివేశారు. జిల్లాలో సోమవారం ఎక్కడా మందుబాబులకు అవసరమైన బ్రాండ్లు లభించలేదు. ఖరీదైన బ్రాండ్లు మాత్రమే అందుబాటులో ఉంచారు. అంత సొమ్ము వెచ్చించలేనివారు నిరాశతో వెనుదిరిగారు.

- అనంతపురం అర్బన


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Jun 04 , 2024 | 12:37 AM