RATHOTSAVAM ; ఘనంగా వేణుగోపాలస్వామి రథోత్సవం
ABN , Publish Date - Aug 29 , 2024 | 12:09 AM
కృష్ణాష్టమి వేడుకల సం దర్భంగా మండల కేంద్రమైన అమరాపురంలోని దక్షిణ గొల్లహట్టిలో వెల సిన వేణుగోపాలస్వామి రథోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారి ఉత్సవమూర్తిని దేవాలయం నుంచి మేళ తాళాలతో ఊరేగింపుగా రథం వద్దకు తీసుకొచ్చారు.
మడకశిర(అమరాపురం), ఆగస్టు 28 : కృష్ణాష్టమి వేడుకల సం దర్భంగా మండల కేంద్రమైన అమరాపురంలోని దక్షిణ గొల్లహట్టిలో వెల సిన వేణుగోపాలస్వామి రథోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారి ఉత్సవమూర్తిని దేవాలయం నుంచి మేళ తాళాలతో ఊరేగింపుగా రథం వద్దకు తీసుకొచ్చారు. వేదపండితులు హ రీష్ బండార్, నరసింహబండార్ ఆధ్వర్యంలో హోమం చేసి, ఉత్సవ విగ్ర హాన్ని రథంలో ప్రతిష్టించారు. భక్తులు స్వామివారి రథాన్ని లాగారు.
భక్తులు బొరుగులు, బెల్లం, అరటిపండ్లు రథంపై విసిరి భక్తిని ప్రదర్శించా రు. ఈకార్యక్రమంలో సీడబ్ల్యూసీ సభ్యుడు ఎన రఘువీరారెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ గురుమూర్తి, బీకే లింగన్న, వెలుగు దేవరాజు, టీడీపీ పట్టణ అధ్యక్షుడు నాగరాజు, డీలర్ కృష్ణమూర్తి, బీసీ చిక్కన్న, అర్చకులు రాజన్న, కాటప్ప, సోషల్‌మీడియా కోఆర్డినేటర్ శివరాజ్, కృష్ణయాదవ యువసంఘం నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....