GRIEVANCE: ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి
ABN , Publish Date - Oct 07 , 2024 | 11:43 PM
ఫిర్యాదుదారుల సమస్యలను ప రిస్కరించడమే ధ్యేయమని, ఫిర్యాదులను నిర్ణీత సమయంలో పరిష్కరించాలని ఎస్పీ రత్న పోలీసు అధికారులను ఆదేశించారు.
పుట్టపర్తి రూరల్, అక్టోబరు 7: ఫిర్యాదుదారుల సమస్యలను ప రిస్కరించడమే ధ్యేయమని, ఫిర్యాదులను నిర్ణీత సమయంలో పరిష్కరించాలని ఎస్పీ రత్న పోలీసు అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీసుకార్యాలయంలో ఎస్పీ ఆధ్వర్యంలో ప్రజాపిర్యాదుల పరిస్కారవేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. పిర్యాదుదారులనుంచి 32 ఫిర్యాదులను స్వీకరించారు. విచ్చేసిన ఫిర్యాదుదారులతో ఎస్పీ మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. డీఎస్పీ ఆవుల శ్రీనివాసరావు, లీగల్‌సెల్ అడ్వైజర్ సాయినాథరెడ్డి, స్పెషల్‌బ్రాంచ సీఐ బాలసబ్రహ్మణ్యంరెడ్డి, ఎస్సై ప్రదీ్‌పకుమార్, సిబ్బంది పాల్గొన్నారు.
డీఎస్పీకి సన్మానం: డీఎస్పీశ్రీనివాసరావు విధినిర్వహణలో సమర్థవంతంగా పనిచేశారని ఎస్పీ వీ రత్న కొనియాడారు. సోమవారం స్థానిక జిల్లాపోలీసుకార్యాలయంలో పుట్టపర్తి ఇనచార్జి డీఎస్పీగా విధులు నిర్వర్తించి బదిలీపై వెళ్తున్న సందర్బంగా డీఎస్పీకి ఆత్మీక వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు.