Share News

GUGUDU : గూగూడువాసా... గోవిందా!

ABN , Publish Date - Jul 16 , 2024 | 11:43 PM

గూగూడు కుళ్లాయిస్వామి పెద్ద సరిగెత్తు వేడుక మంగళవారం కన్నులపండువగా సాగింది. క్షేత్రంలో కుళ్లాయిస్వామి, ఆంజనేయస్వామి దర్శనాల కోసం ఉదయం నుంచే భారీ క్యూ లైన్లు ఏర్పడ్డాయి. రాష్ట్ర నలుమూలల నుంచి, తెలంగాణ, కర్ణాటక, గోవా, తమిళనాడు నుంచి వేలాది మంది భక్తులు గూగూడుకు తరలివచ్చి స్వామివార్లను దర్శించుకున్నారు. ‘కుళ్లాయి స్వామి గోవిందా.. గోవింద..’ అనే నినదాలతో క్షేత్రం మార్మోగుతోంది. మొక్కుబడి ఉన్న కుటుంబాలవారు కాలిన ..

GUGUDU : గూగూడువాసా... గోవిందా!
Mujavars worshiping Kullaiswami

మార్మోగిన కుళ్లాయిస్వామి నామస్మరణ

పెద్ద సరిగెత్తుకు పోటెత్తిన భక్త జనం

గూగూడు కుళ్లాయిస్వామి పెద్ద సరిగెత్తు వేడుక మంగళవారం కన్నులపండువగా సాగింది. క్షేత్రంలో కుళ్లాయిస్వామి, ఆంజనేయస్వామి దర్శనాల కోసం ఉదయం నుంచే భారీ క్యూ లైన్లు ఏర్పడ్డాయి. రాష్ట్ర నలుమూలల నుంచి, తెలంగాణ, కర్ణాటక, గోవా, తమిళనాడు నుంచి వేలాది మంది భక్తులు గూగూడుకు తరలివచ్చి స్వామివార్లను దర్శించుకున్నారు. ‘కుళ్లాయి స్వామి గోవిందా.. గోవింద..’ అనే నినదాలతో క్షేత్రం మార్మోగుతోంది. మొక్కుబడి ఉన్న కుటుంబాలవారు కాలిన నడకన.. మట్టి కుండల్లో పానకాలను తీసుకువచ్చి స్వామివారికి సమర్పించారు. తలనీలాలు సమర్పించి, అగ్నిగుండం చుట్టూ పొర్లు దండాలు పెట్టారు.


వాహనాలలో మొద్దులను తీసుకువచ్చి అగ్నిగుండలో వేశారు. సర్వరోగ నివారణిగా భావించి.. అగ్నిగుండంలోని భస్మాన్ని భక్తులు తమ వెంట తీసుకువెళ్లారు. భక్తుల కోసం గూగూడు మార్గంలో పలువురు అన్నదానం చేశారు. కుళ్లాయిస్వామి పీరును మంగళవారం రాత్రి గ్రామ వీధులలో ఊరేగించారు. గ్రామపెద్దలు రాజన్న, జాఫర్‌వలి, నరసింహులు, దేవదాయశాఖ సిబ్బంది పాల్గొన్నారు.

నేడు జలధి

గూగూడు కుళ్లాయిస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా బుధవారం జలధి కార్యక్రమం నిర్వహిస్తామని ఈఓ శోభ తెలిపారు. కుళ్లాయిస్వామి పీరు వెండి గొడుగును బుధవారం తెల్లవారుజామున, సాయంత్రం అగ్నిగుండ ప్రవేశం చేయించి.. గ్రామ సమీపంలోని బావిలో జలధి నిర్వహిస్తామని తెలిపారు.

- నార్పల


మరిన్ని అనంతపురం వార్తల కోసం..

Updated Date - Jul 16 , 2024 | 11:43 PM