Share News

Gunfire: శ్రీ సత్యసాయి జిల్లాలో తుపాకుల శబ్దం కలకలం..

ABN , Publish Date - Oct 20 , 2024 | 01:15 PM

శ్రీ సత్య సాయి జిల్లా: బత్తలపల్లి మండలం, రామాపురం గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున రామాపురం బస్ స్టాప్‌కు సమీపంలో తుపాకీ కాల్పుల మోత కలకలం రేపింది. తుపాకుల శబ్దంతో రామాపురం గ్రామ ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. బీహార్‌కు చెందిన దొంగల ముఠా రామాపురం గ్రామ పరిసరాల్లో సంచరిస్తున్నారని గమనించిన తెలంగాణ పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు.

Gunfire: శ్రీ సత్యసాయి జిల్లాలో తుపాకుల శబ్దం కలకలం..

శ్రీ సత్య సాయి జిల్లా (Sathya Sai District): బత్తలపల్లి మండలం, రామాపురం గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున రామాపురం బస్ స్టాప్‌ (Ramapuram Bus Stop)కు సమీపంలో తుపాకీ కాల్పుల మోత (Gunfire) కలకలం (Kalakalam) రేపింది. తుపాకుల శబ్దంతో రామాపురం గ్రామ ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. బీహార్‌కు చెందిన దొంగల ముఠా రామాపురం గ్రామ పరిసరాల్లో సంచరిస్తున్నారని గమనించిన తెలంగాణ పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు. కొద్దిసేపు దొంగల ముఠాకు, తెలంగాణ పోలీ సుల (Telangana Police) మద్య ఎదురెదురు కాల్పులు జరిగాయి. కాల్పులు జరుపుకుంటూ పోలీసులు వెంబడించడంతో దొంగల ముఠా ద్విచక్ర వాహనాల్లో పరారయ్యింది. ఓ చోరీ కేసులో విచారణకు వచ్చిన తెలంగాణ పోలీసులపై దుండగులు దాడికి యత్నించారు. దీంతో పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు. దొంగలు పరారీ కావడంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. సమాచారం తెలుసుకున్న ధర్మవరం డీఎస్పీ శ్రీనివాసులు, ధర్మవరం సబ్ డివిజన్‌లో ఉన్న సిఐలు, ఎస్ఐలు, సిబ్బంది హుటాహుటిన రామాపురం గ్రామానికి చేరుకుని. పరిస్థితిని సమీక్షించారు.


కాగా శ్రీ సత్యసాయి జిల్లాలో ఓ కేసు విషయంలో రాజీకి రాలేదని ఓ వ్యక్తి రెచ్చిపోయాడు.. అంతేకాదు తుపాకీ తీసుకుని మరీ బాధితులను బెదిరించాడు. శ్రీ సత్యసాయి జిల్లాలోని రామగిరిలో జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. జిల్లాలోని రామగిరి మండల పరిధిలోని సుద్ధకుంటపల్లి గ్రామంలో తుపాకీతో వ్యక్తి హల్చల్ చేశాడు. ఓ కేసు విషయంలో రాజీకు రావాలని గన్‌తో బెదిరింపులకు గంగాధర్ అనే వ్యక్తి దిగాడు. బాధితులు సదరు వ్యక్తిపై తిరగబడ్డారు. బాధితులు గంగాధర్‌పై రామగిరి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

సుద్ధకుంటపల్లిలో మహిళా ఎంపీటీసీపై లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడని గంగాధర్‌పై గతంలో పోలీస్ కేసు నమోదైంది. ఆ కేసు విషయమై రాజీకు రావాలని ఎంపీటీసీ భర్త కేశవ, ఎంపీటీసీ బంధువులను సదరు వ్యక్తి తుపాకీతో బెదిరించే ప్రయత్నం చేశాడు. తుపాకీతో బెదరింపులకు దిగడంపై స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు. గంగాధర్‌పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన గత నెలలో జరిగింది.


ఈ వార్తలు కూడా చదవండి..

విద్యార్థిని మరణం విషాదకరం: హోం మంత్రి అనిత

దివ్వెల మాధురికీ తిరుమల పొలీసుల నోటీసులు..

గ్రూప్1 పరీక్షలకు లైన్ క్లియర్

అమరావతికి నిధులు వస్తున్నాయి..

టీటీడీ టిక్కెట్లను రూ. 65 వేలకు విక్రయించిన వైసీపీ ఎమ్మెల్సీ

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Oct 20 , 2024 | 01:15 PM