Share News

MP, MLA : ప్రజలకు నష్టం కలిగిస్తే సహించం

ABN , Publish Date - Sep 27 , 2024 | 12:19 AM

ప్రజలకు నష్టం కలిగిస్తే సహించేది లేదని ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌ పేర్కొన్నారు. మండలంలోని ఎ నారాయణపురం పంచాయితీ స్టా లిన నగర్‌లో గురవారం ఇది మంచి ప్రభుత్వ కార్యక్రమాన్ని నిర్వహించారు. కలెక్టర్‌ వినోద్‌కుమార్‌, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌, టీడీపీ జిల్లా అధ్యక్షుడు వెంకటశివుడు యాదవ్‌ హాజరయ్యారు.

MP, MLA : ప్రజలకు నష్టం కలిగిస్తే సహించం
Public representatives and officials participated in the program

ఎంపీ అంబికా, ఎమ్మెల్యే దగ్గుపాటి

అనంతపురంరూరల్‌, సెప్టెంబరు 26: ప్రజలకు నష్టం కలిగిస్తే సహించేది లేదని ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌ పేర్కొన్నారు. మండలంలోని ఎ నారాయణపురం పంచాయితీ స్టా లిన నగర్‌లో గురవారం ఇది మంచి ప్రభుత్వ కార్యక్రమాన్ని నిర్వహించారు. కలెక్టర్‌ వినోద్‌కుమార్‌, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌, టీడీపీ జిల్లా అధ్యక్షుడు వెంకటశివుడు యాదవ్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులతో కలసి ఇంటింటికి తిరుగుతూ వందరోజుల్లో ప్రభుత్వం చేపట్టిన పథకాలు, అభివృద్ధి పనుల గురించి ప్రజలకు వివరిం చారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఐసీడీఎస్‌ ఆధ్వర్యంలో చేపట్టిన సామూహిక సీమంతాల కార్యక్రమంలో పాల్గొన్నారు.


అనంతరం నిర్వహించిన సమావేశంలో ఎంపీ మాట్లాడుతూ..వైసీపీ ఐదేళ్ల పాలనలో ఎంత నాశనం చేయాలో అంతా చేశారన్నారు. ఎమ్మెల్యే మాట్లాడు తూ... ప్రజలకు జరుగుతున్న మంచిని చూసి వైసీపీ నేతలు జీర్ణించుకోలేక కుట్రలకు తెర లేపుతున్నారన్నారు. తిరుమల లడ్డూని కలుషితం చేసి, ఇప్పు డు ఆలయాల్లో పూజలు చేయలంటూ జగన పిలుపు నివ్వడం శోచనీయ మన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వసంతకుమార్‌, తహసీల్దార్‌ హరికు మార్‌, ఎంపీడీఓ పుల్లయ్య, పంచాయతీ కార్యదర్శి అశోక్‌బాబు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శులు ఆదినారాయణ, ఆదెన్న, రాయల్‌ మురళి, అర్బన బ్యాంకు చైర్మన జేఎల్‌ మురళి, కురుబ నారాయణస్వామి, బీజేపీ రాష్ట్రకార్యదర్శి లలిత కుమార్‌, టీడీపీ నాయకులు డిష్‌నాగరాజు, ఓబులపతి, నాగరాజు, కూచి హరి, విశాలాక్షి, గౌస్‌మొద్దీన, ఫిరోజ్‌ అహ్మద్‌, సైపుద్దీన, తాజుద్దీన స్వప్న, తేజస్విని, సరిపూటి రమణ, పల్లవి, రాజారావు తదితరులు పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Sep 27 , 2024 | 12:19 AM