HELP ; వరద బాధితులకు చేయూత
ABN , Publish Date - Sep 11 , 2024 | 12:20 AM
విజయవాడ వరద బాధితులకు పట్టణంలోని పురపాలక సంఘం కార్యాలయంలోని మెప్మా విభాగం తరపున ఆర్థిక సాయం అందజేశారు. మెప్మా పొదుపు సంఘాల అధ్యక్షురాలు పార్వతి ఆధ్వర్యంలో మంగళవారం రూ. 1,21,200 చెక్కును ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసు లుకు అందజేశారు.
రాయదుర్గంటౌన, సెప్టెంబరు 10 : విజయవాడ వరద బాధితులకు పట్టణంలోని పురపాలక సంఘం కార్యాలయంలోని మెప్మా విభాగం తరపున ఆర్థిక సాయం అందజేశారు. మెప్మా పొదుపు సంఘాల అధ్యక్షురాలు పార్వతి ఆధ్వర్యంలో మంగళవారం రూ. 1,21,200 చెక్కును ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసు లుకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ దివాకర్‌రెడ్డి, టీఎంసీ నారాయణరెడ్డి, మున్సిపల్ సీఈఓలు సంధ్య, కిరణ్మయి, మున్సిపల్ సిబ్బంది అబ్ధుల్లా, సుధీర్, పొదుపు సంఘాల మహిళలు పాల్గొన్నారు.
కణేకల్లు : మండల ఫర్టిలైజర్స్ అండ్ ఫస్టిసైడ్స్ సీడ్స్ అసోసియేషన తరపున విజయవాడ వరద బాధితుల కోసం రూ. 50 వేలు అందజేసినట్లు ఆ సంఘం అధ్యక్షుడు చాంద్‌బాషా తెలిపారు. సంబంధిత చెక్కును మంగళ వారం రాయదుర్గంలో ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు కలిసి అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు మహేష్‌గుప్త, శరత, తుకారం, చంద్రశేఖర్‌రెడ్డి, సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.
కళ్యాణదుర్గం : ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు పి లుపు మేరకు వరద బాధితుల కోసం శెట్టూరు మండలం మాకొడికి ఉన్న త పాఠశాలలో హిందీ ఉపాధ్యాయుడిగా విధు లు నిర్వహిస్తున్న బద్దేనాయక్ ఆగస్టు నెల జీతం రూ. 66,245 ను విరాళంగా అందజే శారు. ఆ యన మంగళవారం ఎమ్మెల్యేను కళ్యాణదుర్గంలో కలిసి చెక్కు అందించారు. ఎమ్మెల్యే ఆయన ను అభినందించారు.
కళ్యాణదుర్గం(శెట్టూరు): మండలకేంద్రమైన శెట్టూరుకు చెందిన లావణ్య, మంజునాథ్ కుమారుడు చిన్నారి ప్రద్యుస్‌నాథ్ పుట్టినరోజు సంద ర్భంగా తన పాకెట్‌మనీ నుంచి రూ. 5116ను విజయవాడ వరద బాధితులకు విరాళంగా ఇచ్చాడు. ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు చిన్నారిని మెచ్చుకు ని, జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
కుందుర్పి : విజయవాడ వరద బాధితుల కోసం మండలంలోని బెస్తర పల్లికి చెందిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు రూ. 65100 సేకరించారు. ఆ మొత్తాన్ని టీడీపీ సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో మంగళవారం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబుకు అందజేశారు. పార్టీ తరపున ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే విజయవాడ వరద బాధితుల కోసం మండల వ్యాప్తంగా టీడీపీ కార్యకర్తలు బియ్యం బస్తాలు సేకరించారు. వాటిని విజయవాడ తరలించేందుకు సిద్ధంగా ఉంచారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....