MLA SUNITA : అభివృద్ధి పనులను అడ్డగిస్తే...ఊరుకునేది లేదు
ABN , Publish Date - Oct 20 , 2024 | 11:37 PM
వైసీపీ హయాంలో జా నెడు రోడ్డు వేయలేకపోయినా.. మాజీ ఎమ్మెల్యే ప్రకాష్‌రెడ్డి మాటలు మాత్రం కోటలు దాటేవని ఎమ్మెల్యే పరిటాల సునీ త ఘాటుగా విమర్శించారు. మండలం లోని ఆలమూరులో ఆదివారం మధ్యా హ్నం పల్లె పండుగ వారోత్సవాల కార్యక్ర మంలో భాగంగా సీసీరోడ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు.
ఎమ్మెల్యే పరిటాల సునీత
అనంతపురంరూరల్, అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి): వైసీపీ హయాంలో జా నెడు రోడ్డు వేయలేకపోయినా.. మాజీ ఎమ్మెల్యే ప్రకాష్‌రెడ్డి మాటలు మాత్రం కోటలు దాటేవని ఎమ్మెల్యే పరిటాల సునీ త ఘాటుగా విమర్శించారు. మండలం లోని ఆలమూరులో ఆదివారం మధ్యా హ్నం పల్లె పండుగ వారోత్సవాల కార్యక్ర మంలో భాగంగా సీసీరోడ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఎమ్మెల్యే పరిటాల సునీత హాజరయ్యారు. ముందుగా రూ.20లక్షలతో సీసీ రోడ్డు, రూ.2లక్షలతో రచ్చకట్ట నిర్మాణానికి ఆమె భూమి పూ జ చేశారు. అనంతరం సమావేశంలో ఆమె మాట్లాడు తూ... అభివృద్ధి కోసం కలిసి వస్తే కలుపుకొని పోతా మని.. అదే అభివృద్ధికి అడ్డు తగిలితే ఊరుకునే ప్రసక్తేలేదని హెచ్చరించారు. వారు గ్రామాల్లో అభివృ ద్ధి పనులు చేయరని, ఇంకొకరు చేస్తుంటే కమీషన్ల కోసం అడ్డుకుంటారని విమర్శలు చేశారు.
టీడీపీ అధి కారంలోకి వచ్చిన కేవలం వందరోజుల్లోనే ఆలమూరు కు రోడ్డు వేయిస్తున్నామని, రానున్న రోజుల్లో ఇంకా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడుతామన్నారు. గ్రామ స్థులు తన దృష్టికి తీసుకొచ్చిన ప్రతి సమస్యను పరి ష్కరిస్తామని హామీ ఇచ్చారు. అలాగే మండలంలో అనర్హులను ఏరి వేసి అర్హులందరికీ పింఛన్లు, ఇంటి పట్టాలు ఇవ్వడమే కాకుండా ఇల్లు నిర్మించి ఇస్తామ న్నారు. దీపావళికి ఉచితంగా మూడు గ్యాస్ సిలెండర్ల పంపిణీ చేస్తామన్నారు. ఈకార్యక్రమంలో ఎంపీడీఓ దివాకర్, ఈఓఆర్డీ వెంకటనాయుడు, పీఆర్ జేఈ వెంకట శేషయ్య, పంచాయతీ కార్యదర్శి గోవిందరా జులు, మాజీ జడ్పీటీసీ వేణుగోపాల్, మండల ప్రధాన కార్యదర్శి పామురాయి రఘు, మండల మాజీ కన్వీనర్ చల్లా జయకృష్ణ, టీడీపీ సీనియర్ నాయకులు సూరి, బాలు, హరి, వీరాంజినేయులు, రామ్మోహన, ఈశ్వరయ్య, వెంకటేష్, హరి తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....