మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయండి
ABN , Publish Date - Sep 27 , 2024 | 12:00 AM
ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని ఏఐఎ్‌సఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డి డిమాండ్ చేశారు.
లేపాక్షి, సెప్టెంబరు 26: ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని ఏఐఎ్‌సఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం తహసీల్దార్ కార్యాలయం ముందు విద్యార్థులతో కలిసి బైఠాయించి నిరసన తెలిపారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ జూనియర్ కళాశాలకు సుదూర ప్రాంతాల నుంచి విద్యార్థులు వస్తున్నారని వారు మధ్యాహ్నం భోజనం లేక అవస్థలు పడుతున్నారన్నారు. అనంతరం రెవెన్యూ అధికారులకు వినతిపత్రం అందించారు.