వినూత్న తనిఖీ..!
ABN , Publish Date - May 09 , 2024 | 12:37 AM
ఎప్పుడూ పోలీసులే వాహనాలను తనిఖీ చేయాలా..? ఏం.. వారి వాహనాలను మాత్రం తనిఖీ చేయకూడదా..? ఎన్నికల నేపథ్యంలో అనంతపురం నగరంలో పోలీసు వాహనాలను అసిస్టెంట్ కలెక్టర్ వినూత్న ఆధ్వర్యంలో అధికారులు బుధవారం తనిఖీ చేశారు. అధికార పార్టీ అభ్యర్థుల తరఫున కొందరు పోలీసు అధికారులు, సిబ్బంది ఓట్ల కొనుగోలుకు పూనుకోవడం గురించి ఆంధ్రజ్యోతిలో వరుస కథనాలు వస్తున్నాయి. ఓటుకు రూ.3 వేలు ఇస్తామని పోస్టల్ బ్యాలెట్ ఓటర్లను ప్రలోభ పెడుతున్నారు. రాయదుర్గం, కళ్యాణదుర్గం, అనంతపురం అర్బనలో ఈ వ్యవహారం..
ఎప్పుడూ పోలీసులే వాహనాలను తనిఖీ చేయాలా..? ఏం.. వారి వాహనాలను మాత్రం తనిఖీ చేయకూడదా..? ఎన్నికల నేపథ్యంలో అనంతపురం నగరంలో పోలీసు వాహనాలను అసిస్టెంట్ కలెక్టర్ వినూత్న ఆధ్వర్యంలో అధికారులు బుధవారం తనిఖీ చేశారు. అధికార పార్టీ అభ్యర్థుల తరఫున కొందరు పోలీసు అధికారులు, సిబ్బంది ఓట్ల కొనుగోలుకు పూనుకోవడం గురించి ఆంధ్రజ్యోతిలో వరుస కథనాలు వస్తున్నాయి. ఓటుకు రూ.3 వేలు ఇస్తామని పోస్టల్ బ్యాలెట్ ఓటర్లను ప్రలోభ పెడుతున్నారు. రాయదుర్గం, కళ్యాణదుర్గం, అనంతపురం అర్బనలో ఈ వ్యవహారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో అనంతపురం నగరంలోని జూనియర్
కళాశాలలో ఫెసిలిటేషన కేంద్రం వద్ద ఉన్న పోలీసు వాహనాలను అసిస్టెంట్ కలెక్టర్ తనిఖీ చేయించారు. మైదానంలో ఉన్న వాహనాల గురించి ఆమె ఆరాతీశారు. పోలీసు వాహనాల్లో ఏమున్నాయోనని ఆమె స్వయంగా పరిశీలించారు. పోలీసులు కూడా అప్రమత్తంగా వ్యవహరించారు. ఓటు హక్కు ఉన్నవారిని మాత్రమే లోపలికి అనుమతించారు. డ్వామా కార్యాలయం వద్ద అంతర్ జిల్లా పోస్టల్ బ్యాలెట్ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వైసీపీ నాయకులు.. సచివాలయ ఉద్యోగులకు డబ్బు ఎరవేస్తూ కనిపించారు. -అనంతపురం టౌన
మరిన్ని అనంతపురం వార్తల కోసం....